హైదరాబాద్, సెప్టెంబర్ 11 (ఇయ్యాల తెలంగాణ) : టీచర్స్ డే వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్ జిల్లా సైన్స్ అధికారి సి. ధర్మేందర్ రావు జంగమ్మెట్ బండ్లగూడ మండలం కరెస్పాండెంట్ జె. రామ రాజు కు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని బర్కత్ పుర లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ఈ నెల 10 వ తేదీన నిర్వహించారు. హైదరాబాద్ JNTU వైస్ ఛాన్సలర్ ప్రొఫసర్ కట్టా నర్సింహా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేశారు.