ఉగ్రలింక్‌లలో కొత్త కోణం

హైదరాబాద్‌, జూన్‌ 29, (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌లో ఉగ్రవాదుల లింకులు బయటపడటం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో పలుచోట్ల దాడులు చేపట్టిన గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు.. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న పలువురిని అరెస్ట్‌ చేయడం సంచలనం రేపుతోంది. హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారని, పలువురిని ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ప్రయత్నించారనే వార్తలతో రాష్ట్ర పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని పోలీస్‌ అధికారులు ప్రశ్నిస్తుండగా.. కొత్త విషయాలు బయటపుడుతున్నాయి. తాజాగా ఎూఐఖ ఉగ్రవాద సంస్థ నెట్‌వర్క్‌ లింక్‌లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారనే కారణంతో సూరత్‌కు చెందిన సబెర భాను, హైదరాబాద్‌కు చెందిన ఖదీజా అలియాస్‌ అబిదాను కొద్దిరోజుల క్రితం గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

వీరిని ప్రశ్నించగా.. అనేక కొత్త విషయాలు బయటకొచ్చాయి. ఈ ఇద్దరు మహిళలు ఎూఐఖ విస్తరణ కోసం దేశవ్యాప్తంగా నెట్వర్క్‌ పెట్టుకున్నట్లు గుర్తించారు. వీరిద్దరు కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు నెట్వర్క్‌ ఏర్పాటు చేయడమే కాకుండా యూత్‌ను రాడికలైజ్‌ ఎూఐఖలో చేర్చుకున్నారని తేల్చారు. ఇప్పటికే అరెస్టయిన కొంతమంది ఉగ్రవాదులతో వీరికి లింకులు ఉన్నట్లు గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు గుర్తించారు.ఈ ఇద్దరి మహిళలతో ఇంకా ఎవరెవరు కాంటాక్ట్‌లో ఉన్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గుజరాత్‌, జమ్మూ కాశ్మీర్‌, యూపీ, తెలంగాణలలో ఎూఐఖ నెట్‌వర్క్‌ను ఇప్పటికే విస్తరించినట్లు పోలీసులు తెలిపారు. సుబెర, అభిధాలుగుజరాత్‌లోని పోర్‌బందర్‌లో ఒక బోట్‌ను హైజాక్‌ చేసి ఆఫ్ఘనిస్థాన్‌కు కూడా వెళ్లాలని ప్లాన్‌ చేసినట్లు చెప్పారు.గుజరాత్‌లో ఇప్పటికే అరెస్టు అయిన నలుగురు ఉగ్రవాదులతో కలిసి సుబెర, అభిధా ఉగ్ర దాడులకు ప్లాన్‌ చేసినట్లు విచారణలో బయటపడిరది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....