ఉక్రెయిన్‌ తర్వాత పుతిన్‌ టార్గెట్‌ ‘మోల్దోవా’ ?

న్యూ ఢిల్లీ మార్చ్  2 (ఇయ్యాల తెలంగాణ) : రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చాలా దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు ఆయన ఆంతరంగికులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకూ కేవలం ఉక్రెయిన్‌ పైనే బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నారు. పుతిన్‌ మరో ప్లాన్‌కు కూడా రంగం సిద్ధం చేసినట్లు ఆయనకు అత్యంత దగ్గరి స్నేహితుడు, బెలారూస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకాషంకో వెల్లడించారు. లుకాషంకో కొన్ని రోజుల క్రితం ఉన్నతాధికారులతో ఓ ఆంతరంగిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే పుతిన్‌ తదుపరి లక్ష్యం ఏమిటన్నది లీక్‌ అయినట్లు సమాచారం. ఉక్రెయిన్‌ తర్వాత పుతిన్‌ విరుచుకుపడేది పక్కనే వున్న మోల్దోవాపై అని ఆయన అధికారులతో అన్నారు. రష్యా` ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో బెలారూస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకాషంకో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ఓ మ్యాపును చూపిస్తూ.. రష్యా.. ఉక్రెయిన్‌ను ఎలా స్వాధీనం చేసుకోవాలని చూస్తుందో వివరించారు. ఈ సమయంలోనే ఆయన పుతిన్‌ తదుపరి టార్గెట్‌ను కూడా వెల్లడిరచారు. ప్రస్తుతం ఇది సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....