ఉక్రెయిన్‌ అధ్యక్షునితో ప్రధాన మంత్రి Modi భేటీ

న్యూయార్క్‌ లో ‘ది సమిట్‌ ఆఫ్‌ ది ఫ్యూచర్‌’ కార్యక్రమం సందర్భంగా నిన్న (2024 సెప్టెంబర్‌ 23న) ఉక్రెయిన్‌ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్‌ జిలెన్‌ స్కీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు.ఉక్రెయిన్‌ లో ప్రధాని ఇటీవల పర్యటించడాన్ని నేతలు ఇద్దరూ గుర్తుకు తెచ్చుకోవడంతో పాటు, ద్వైపాక్షిక సంబంధాల స్థిరీకరణ దిశగా కృషిని కొనసాగించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ లోని అనిశ్చితి నేపథ్యంలో శాంతి మార్గాన్ని అనుసరించడం మన ముందున్న ఏకైక మార్గమనే అంశం వారి చర్చలలో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది.

దౌత్యం ద్వారా, చర్చల ద్వారా, సంబంధిత వర్గాలన్నిటికీ ప్రాతినిధ్యం ద్వారానే  పోరాటానికి శాంతియుక్త సమాధానాన్ని అన్వేషించగలమన్న భారతదేశ స్పష్టమైన, స్థిరమైన, సుసంఘటిత వైఖరిని ప్రధాన మంత్రి మరో సారి స్పష్టం చేశారు.  సంఘర్షణకు దీర్ఘకాలిక, శాంతియుత సమాధానం లభించేందుకు అనువైన స్థితిని స్థాపించడానికి భారతదేశం తన వద్ద అందుబాటులో ఉన్న అన్ని విధాలైన సమర్థనను అందించడానికి ముందుకు వస్తుందని ఆయన తెలియజేశారు. మూడు నెలలు గడచి కొన్ని రోజులే అయినప్పటికీ ఇంత కాలంలోనే ఇద్దరు నేతలు మూడుసార్లు సమావేశమయ్యారు. సంప్రదింపులను ఇక విూదటా కొనసాగిద్దామంటూ ఉభయనేతలు వారి సమ్మతిని వ్యక్తం చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....