ఉక్రెయిన్‌కు భారత్‌ సాయం

ఉక్రెయిన్‌కు భారత్‌ సాయం

న్యూ ఢిల్లీ, మార్చి 2 (ఇయ్యాల తెలంగాణ) : రష్యా దాడితో సతమతమవుతున్న ఉక్రెయిన్‌కు భారత్‌ సాయం అందించి మానవత్వాన్ని చాటుకుంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడి వినతి మేరకు అత్యవసరమైన మెడిసిన్లతో పాటు బ్లాంకెట్లు, టెంట్లు, సోలార్‌ ల్యాంప్స్‌ సహా ఇతర సామగ్రి అందించింది. పోలండ్‌ ద్వారా బుధవారం రెండు టన్నుల విలువైన మెడిసిన్స్‌ను ఉక్రెయిన్‌కు తరలించింది. త్వరలో రొమేనియా ద్వారా మరికొంత సాయం అందించేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. అత్యవసరానికి వినియోగమయ్యే సామగ్రిని ఉక్రెయిన్‌కు తరలిస్తున్నట్లు కేంద్రం చెప్పింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన సీ 17 విమానం ద్వారా భారతీయులను తరలించే ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....