ఈటలతో నాకు విభేదాలు లేవు మాజీ ఎంపి జితేందర్‌ రెడ్డి

హైదరాబాద్‌జులై 3, (ఇయ్యాల తెలంగాణ ):ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తో తనకు విభేదాలు లేవని మాజీ ఎంపి జితేందర్‌ రెడ్డి స్పష్టం చేసారు.  ఈటలకు కీలక పదవి ఇస్తే నేను స్వాగతిస్తా. ఈటలతో కలసి పదేళ్ళు తెలంగాణ ఉద్యమంలో కలసి పనిచేశానని గుర్తు చేసారు. ఆర్థికమంత్రిగా ఢల్లీి వచ్చినప్పుడు ఈటల  నా ఇంట్లోనే ఉండేవారు. హుజూరాబాద్‌ లో ఈటల గెలుపు కోసం నేను కృషి చేశాను. ఈటల సహా… పార్టీ నేతలందరం కలుసే ఉంటామని అయన అన్నారు. బీజేపీ అధ్యక్షుడి మార్పుపై  నాకు సమాచారం లేదు. నేను బీజేపీ అధ్యక్షుడు రేసులో లేను. పార్టీ ఇచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తాను.2004లో టీఆర్‌ఎస్‌ తో బంధుత్వం ఎవరు పెట్టుకున్నారో రాహుల్‌ గాంధీ తెలుసుకోవాలి. బీజేపీపై రాహుల్‌ గాంధి కామెంట్స్‌ ను ఖండిస్తున్నాను. రాహుల్‌ గాంధీ కామెంట్స్‌ పై రేవంత్‌ రెడ్డి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్‌ కు మహబూబ్నగర్‌  జిల్లాలో నలుగురు  అభ్యర్థులు కూడా లేరు. నిజామాబాద్‌, రంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ కు అభ్యర్థులే లేరు. పొంగులేటి చేరికతో… వాపును చూసి కాంగ్రెస్‌ బలుపు అనుకుంటున్నారు కాంగ్రెస్‌ నేతలని అయన అన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....