ఇన్ స్పైర్ అవార్డ్స్ మానక్–2022-23 దరఖాస్తుల ఆహ్వానం :–

హైదరాబాద్ ,జూలై 3 (ఇయ్యాల తెలంగాణ)

విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ఇన్స్పైర్ మనకు మేళాను జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిణి ఆర్.  రోహిణి గారు పేర్కొన్నారు.

2022–23 విద్యా సంవత్సరానికి గానూ నూతన ఆవిష్కరణలకు సంబంధించి నామినేషన్ల స్వీకరించనున్నట్లు తెలిపారు. అన్నీ యాజమాన్యాలకు సంబంధించి ప్రాథమికోన్నత , ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఆయా పాఠశాలల నుంచే జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు www.inspireawards-dst.gov.in www.inspireawards-dst.gov.in లో ప్రాజెక్టు అంశాలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు , 

ప్రతి పాఠశాల నుంచి 5 ప్రాజెక్టులు పంపాలని , ఉప విద్యాశాఖాధికారులు ,  ప్రధానోపాధ్యాయులు మరియు గైడ్టీచర్లు చొరవ తీసుకుని సకాలంలో ప్రాజెక్టులను పంపాలని ఆదేశించారు ,  నామినేషన్ల పరిశీలన అనంతరం ఎంపికైన విద్యార్థులకు రుా 10 వేల చొప్పున వారి ఖాతాలో ప్రాజెక్టు రూపకల్పన కోసం జమ చేయనున్నట్లు తెలిపారు.

 సందేహాలకు జిల్లా సైన్స్ అధికారి సీ . ధర్మేందర్ రావ్ 7799171277 ను సంప్రదించాలన్నారు .

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....