ఇజ్రాయెల్‌ నుంచి ఢల్లీకి చేరుకున్న తొలి చార్టర్డ్‌ ఫ్లైట్‌

న్యూఢల్లీ అక్టోబర్ 13 (ఇయ్యాల తెలంగాణ ); హమాస్‌ హింసతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్‌ దేశం నుంచి భారతీలయను తీసుకువస్తున్న తొలి ఫ్లైట్‌ శుక్రవారం ఢల్లీకి చేరుకుంది. ఢల్లీఎయిర్పోర్టులో ంఎ 1140 విమానం ల్యాండయింది. ఫస్ట్బ్యాచ్లో 212 మంది భారతీయులు వచ్చారు. పలువురు తెలుగు విద్యార్థులు కుడా ఢల్లీకి చేరుకున్నారు. ఎయిర్పోర్టులో భారతీయులను కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ రిసీవ్‌ చేసుకున్నారు. అయన కువిద్యార్దులు ఇజ్రాయెల్లో పరిస్థితులను వివరించారు. బెన్‌ గురియన్‌ ఎయిర్పోర్ట్‌ నుంచి ఫ్లైట్‌ గురువారం రాత్రి బయలుదేరింది. శుక్రవారం ఉదయం 5 గంటలకు ఢల్లీ ఎయిర్పోర్టులో విమానం ల్యాండయింది.  ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయుల కోసం కేంద్రం  ఆపరేషన్‌ అజయ్‌ చేపట్టిన విషయం తెలిసిందే.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....