చిరుత ఎక్కడ ? దొరకదా నీ జాడ ?
కొనసాగుతున్న గాలింపు చర్యలు
హైదరాబాద్,మే15(ఇయ్యాల తెలంగాణ ): రాజేంద్రనగర్ శివారు మైలార్‌దేవ్‌పల్లి`కాటేదాన్ ప్రధాన రహదారి హైవే రోడ్డు పక్కన గురువారం గాయాతో కనిపించిన చిరుత ఆచూకి ఇంకా చిక్కలేదు. దానికోసం గాలింపు కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం నుంచి అధికాయి శ్రమిస్తున్నా చిరుత ఆచూకీ భించలేదు. సవిూపంలోని రైల్వే స్టేషన్ పక్కన చెట్లు ఎక్కువగా ఉండడంతో అక్కడే ఉంటుందని భావిస్తున్నారు. క్వకుర్తి పరిసర ప్రాంతాల్లో తప్పించుకున్న చిరుత ఇదే అయి ఉంటుందని, శంషాబాద్ అటవీ ప్రాంతం విూదుగా వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చిరుత ఇంకా దొరక్కపోవడంతో స్థానికు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇళ్ళలో నుంచి ఎవ్వరూ బయటకు రావొద్దని అధికాయి స్థానికును హెచ్చరించారు. డ్రోన్ కెమెరా సాయంతో ఆ ప్రాంతమంతటా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.కాగా చిరుతపులికి సంబంధించిన అడుగును అధికాయి గుర్తించారు. కాగా అడుగు ఆధారంగా చిరుత ఫాంహౌస్ లోనే ఉన్నట్లు తొస్తుంది. చిరుతను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన నైట్ విజన్ కెమెరాతో పాటు ట్రాప్ కెమెరా ఫీడ్ ఆధారంగా అధికాయి చిరుత ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. చిరుతను బంధించేందుకు రెండు బోన్లతో పాటు ప్రత్యేక వల ఏర్పాటు చేశారు. దీంతో పాటు అటవీశాఖకు చెందిన షూటర్లను కూడా సిద్ధంగా ఉంచారు. ఎలాగైనా సరే చిరుతను పట్టుకొని తీరుతామని అధికాయి వ్లెడిరచారు.