ఆర్యన్‌ను డి ఆడిక్షన్‌ సెంటర్‌కు పంపాలి

షారూఖ్‌ ఖాన్‌కు సూచించిన కేంద్ర మంత్రి

ముంబై,అక్టోబర్‌25(ఇయ్యాల తెలంగాణ): షారూఖ్‌ ఖాన్‌  కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను డి అడక్షన్‌ సెంటర్‌కు పంపాలని కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే సూచించారు.చిన్న వయసులో డ్రగ్స్‌ తీసుకోవడం మంచిది కాదని అంటూ ఆర్యన్‌ ఖాన్‌కు భవిష్యత్తు ఉందన్నారు. అతను డ్రగ్స్‌ నుంచి బయటపడడానికి తాను ఈ సలహా ఇస్తున్నానని అన్నారు.  డ్రగ్స్‌ ఆన్‌ క్రూయిజ్‌ కేసులో అరెస్టయిన ఆర్యన్‌ ఖాన్‌ను పునరావాస కేంద్రానికి పంపాలని బాలీవుడ్‌ నటుడు షారూఖ్‌ ఖాన్‌కు అథవాలే సూచించారు. ఆర్యన్‌ ఖాన్‌ను డి`అడిక్షన్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌కి పంపమని నేను షారుఖ్‌ ఖాన్‌కు సలహా ఇస్తున్నాను. అతను 1`2 నెలలు అక్కడ ఉండాలి, అతడిని జైల్లో ఉంచకుండా.. దేశవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలు చాలానే ఉన్నాయి.. ఒకటి రెండు నెలల్లో డ్రగ్స్‌ వ్యసనం నుంచి విముక్తి పొందుతాడని కేంద్ర మంత్రి రాందాస్‌ పేర్కొన్నారు. క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసులో దర్యాప్తు చేసినందుకు నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో జోనల్‌ డైరెక్టర్‌ సవిూర్‌ వాంఖడేను కేంద్రమంత్రి అథవాలే ప్రశంసించారు. అయితే కొందరు అతడిపై ఆరోపణలు చేస్తూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....