‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ march – 1న విడుదల

వరుణ్‌ తేజ్‌, సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, రినైసన్స్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ మార్చి 1న విడుదల

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ మేడిన్‌ బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ అద్భుతమైన పోస్టర్‌లు, ఎడ్జ్‌ ఆఫ్‌ ది సీట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ప్రామిస్‌ చేసిన గ్రిప్పింగ్‌ టీజర్‌, రిపబ్లిక్‌ డేకి ముందు దేశభక్తి జ్వాలని రగిలించిన ఫస్ట్‌ సింగిల్‌ వందేమాతరంతో హ్యుజ్‌ బజ్‌ క్రియేట్‌ చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ తెలుగు`హిందీ ద్విభాషా చిత్ర కొత్త విడుదల తేదీని అనౌన్స్‌ చేశారు మేకర్స్‌.

ఆపరేషన్‌ వాలెంటైన్‌ మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మిక్కీ జె మేయర్‌ స్కోర్‌ చేసిన మొదటి సింగిల్‌ వాఘా బోర్డర్‌లో లాంచ్‌ చేశారు.  మరో నెలలో సినిమా థియేటర్లలోకి రానుంది కాబట్టి, ప్రమోషన్స్‌ ను మరింత దూకుడుగా ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌ .

ఈ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేస్తున్న మానుషి చిల్లర్‌ రాడార్‌ ఆఫీసర్‌గా కనిపించనుంది. ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చిత్రం  దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరగని  పోరాటాని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ల అద్భుతంగా చూపించబోతుంది.

ఆపరేషన్‌ వాలెంటైన్‌’ కుశక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, సందీప్‌ ముద్దా రినైసన్స్‌ పిక్చర్స్‌ నిర్మించారు, గాడ్‌ బ్లెస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (వకీల్‌ ఖాన్‌), నందకుమార్‌ అబ్బినేని సహ నిర్మాతలు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....