ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28 శాతం ట్యాక్స్‌..

    

న్యూఢల్లీ జూలై 12, (ఇయ్యాల తెలంగాణ ): జీఎస్టీ కౌన్సిల్‌ 50వ సమావేశంలో నిర్ణయం    క్యాన్సర్‌ ఔషధాలకు మినహాయింపు, జీఎస్టీ కౌన్సిల్‌ 50వ సమావేశంలో  ఆన్‌లైన్‌ గేమింగ్‌ ముఖ విలువలో 28 శాతం ట్యాక్స్‌ విధింపునకు జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. హార్స్‌ రేసింగ్‌, క్యాసినోలకు ఇదే రేటు వర్తించనుంది. కాగా ఈ సమావేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. నైపుణ్యానికి సంబంధించిన గేమ్‌ అయినా, డబ్బుల పందెంతో ఆడే గేమ్‌ అయినా 28 శాతం జీఎస్టీ వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు క్యాన్సర్‌ సంబంధిత ఔషధాలు, అరుదైన వ్యాధులకు మెడిషిన్లు, ప్రత్యేక వైద్య పరిస్థితుల్లో అవసరమయ్యే ఆహార ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయింపునిస్తూ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది.జీఎస్టీ భేటీ ముగిసిన అనంతరం కేంద్ర ఆర్థిక, కార్పొరేటు వ్యవహారాల శాఖల మంత్రి నిర్మలా సీతారామన్‌ విూడియాకు వెల్లడిరచారు. కొన్ని ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను తగ్గించగా.. మరికొన్నింటిని రెగ్యులర్‌ చేయనున్నట్టు వెల్లడిరచారు. వండని, వేగించని స్నాక్స్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి, ఫిష్‌ సోలుబుల్‌ పేస్ట్‌పై 18 శాతం నుంచి 5 శాతం, నూలుపై 12 శాతం నుంచి 5 శాతానికి, ఎల్‌డీ స్లాగ్‌పై 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్టు నిర్మలా సీతారామన్‌ వెల్లడిరచారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....