ఆగస్టు 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించిన ప్రదాని మోడీ

 బెంగుళూరు ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ ): చంద్రయాన్‌`3 మిషన్‌ను అత్యంత విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలను ఇవాళ ప్రధాని మోదీ కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 23వ తేదీని ఇక నుంచి జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇక చంద్రయాన్‌`3కి చెందిన విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన ప్రాంతాన్ని శివశక్తిగా నామకరణం చేస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడిరచారు. బెంగుళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్వర్క్‌ మిషన్‌ కంట్రోల్‌ కాంప్లెక్స్‌లో శాస్త్రవేత్తలను మోదీ కలిశారు. చంద్రుడిపై చంద్రయాన్‌`2 జ్ఞాపకాలను వదిలి వెళ్లిన ప్రాంతాన్ని తిరంగాగా నామకరణం చేస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడిరచారు. భారత్‌ సాగించిన ప్రతి ప్రయత్నానికి ఇస్రో స్పూర్తిగా నిలుస్తుందన్నారు. విఫలమనేది అన్నింటికీ అంతం కాదు అన్న సత్యాన్ని గుర్తు చేస్తుందన్నారు.

 చంద్రయాన్‌`3 విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన ప్రాంతాన్ని శివశక్తిగా నామకరణం

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....