ఆకాశంలో అత్యంత విశాలమైన RAINBOW (ఇంద్రధనస్సు)

హైదరాబాద్ జులై 31,(ఇయ్యాల తెలంగాణ) : ఈ రోజు సాయంత్రం కురిసిన వర్షం  నగర వాసులకు  కొత్త అనుభూతిని అందించింది. “చిటపట చినుకులు” ఎన్నో రోజుల తర్వాత చాలామంది జనాలకు ఆనందాన్ని కలిగించాయి వర్షం కురిసినా, ఒక పక్క ఎండ మరో పక్క వాన ఏకధాటిగా వర్షం కురిసినా జనాలు పరవశించి పోయారు. వారాంతం తరువాత మొదటి రోజు కావడంతో అనేక మంది ఆఫీసుల్లో నుంచి ఇంటికి వెళ్లే సమయంలోనే కురిసిన వర్షం కానీ ఈ రోజు వర్షం అందరికి కొత్త అనుభూతిని అందించిందని చాల మంది చెప్పుకొచ్చారు. గత కొద్దీ రోజలుగా కురుస్తున్న వర్షాలతో సతమతమవుతున్న జనాలకు ఈ రోజు పూర్తిగా ఎండలు దంచి కొట్టడంతో    చాలా మంది జనాలు ఏంతో ఉపశమనం పొందారు. మళ్లీ తిరిగి సాయంత్రం సమయంలో వాన జోరందుకోవడంతో అబ్బా ! ఇది ఏమి వాన ! అని అనుకున్నారు. ఆఫీసుల్లో నైతే తీరా ఇంటికి వెళ్లే సమయానికే మొదలయ్యిందిరా ! అనుకున్నారు.కానీ ఈ రోజు వరుణ దేవుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు మిమ్మల్ని సంతోష పెట్టడానికి వచ్చాను అనేలా పరిస్థితులు తారుమారయ్యాయి.   ఏకధాటిగా కురిసిన వర్షం కాస్త ఒక పక్క మబ్బులతో కమ్ముకున్న ఆకాశం కొద్దీ నిముషాల లోనే పూర్తిగా సాధారణ స్థితికి వచ్చి మేఘాలన్నీ మటు మాయమై, కనువిందు చేసాయి.

ఒక పక్క ఏకధాటి వాన మరో పక్క మేఘాలు ఎక్కడికక్కడ కదిలిపోయి ఆకాకాశమంత చిరునవ్వుతో పలకరించినంట్లు కనిపించింది.అయినప్పటికీ కొద్దీ సేపు వర్షం దంచి కొట్టింది. దీనికి తోడు నిజంగానే వరుణ దేవుడు సంతోషాన్ని పంచుతున్నాడా ! అనే అద్భుత దృశ్య కావ్యం హైదరాబాద్ లోని ఆకాశంలో కనువిందు చేసింది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల నుంచి కిందకు దిగగానే తూర్పు వైపున కొద్దీ సేపు అత్యంత విశాలమైన సైజులో ఇంద్రధనస్సు కనువిందు చేసింది. ఈ అద్భుత దృశ్య కావ్యాన్ని ఈ రోజు మీరు చూసుంటే ! కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....