ఆకస్మాత్తుగా కూలిపోయిన Open Pit బంగారు గని.. 23 మంది మృతి

న్యూ డిల్లీ ఫిబ్రవరి 22 (ఇయ్యాల తెలంగాణ) : సెంట్రల్‌ వెనిజులాలో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న ఓపెన్‌ పిట్‌ బంగారు గని ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 23 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌ల్లో సవిూప ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఆంగోస్తురా మునిసిపాలిటీలో మంగళవారం ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. బుల్లా లోకా అనే ప్రాంతంలోని గనిలో గోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకు 23 మంది మృతదేహాలను వెలికి తీశామని, మరో 11 మంది గాయపడినట్లు తెలిసిందని బొలివర్‌ రాష్ట్ర గవర్నర్‌ ఏంజెల్‌ మార్కానో అక్కడి విూడియాకు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై వెనిజులా ప్రెసిడెంట్‌ నికోలస్‌ మదురో స్పందించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. శిథిలాల కింద ఉన్నవారిని గుర్తించి, రక్షించాలన్నారు. సివిల్‌ డిఫెన్స్‌ బృందాలను ఇప్పటికే పంపామని తెలిపారు. బొలివర్‌ గవర్నర్‌ ఏంజెల్‌ మార్కానోతో మాట్లాడి, సహాయక చర్యలపై ఆరా తీసినట్లు ప్రెసిడెంట్‌ పేర్కొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....