‘అసురగణ రుద్ర’ – నీ కనులలో పాట విడుదల

నరేష్‌ అగస్త్య , మురళీ కాట్రాగడ్డ, కమ్జుల ప్రొడక్షన్స్‌ ‘అసురగణ రుద్ర’ నుంచి నీ కనులలో పాట విడుదల నరేష్‌ అగస్త్య, సంగీర్తన విపిన్‌, ఆర్యన్‌ రాజేష్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న మెడికల్‌ క్రైం థ్రిల్లర్‌ ‘అసురగణ రుద్ర’. మురళీ కాట్రాగడ్డ దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ చిత్రాన్ని కమ్జుల ప్రొడక్షన్స్‌ పతాకంపై మురళీ వంశీ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ చిత్రం నుంచి ‘నీ కనులలో’  పాటని విడుదల చేశారు మేకర్స్‌. శేఖర్‌ చంద్ర ఈ పాటని మళ్ళీ మళ్ళీ వినాలనిపించే బ్యూటీఫుల్‌ మెలోడి కంపోజ్‌ చేశారు. సిద్దార్థ్‌ విూనన్‌ లైవ్లీ గా పాడిన ఈ పాటకు నికేష్‌ కుమార్‌ దాసగ్రంధి ఆకట్టుకునే సాహిత్యం అందించారు. ఈ పాటలో లీడ్‌ పెయిర్‌ మధ్య కెమిస్ట్రీ ని చాలా ప్లజంట్‌ గా ప్రజెంట్‌ చేశారు.మురళీ శర్మ, ఆమని, శత్రు, అమిత్‌, అభినయ, దేవీ ఫ్రసాద్‌ లాంటి ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమరనాథ్‌ బొమ్మిరెడ్డి కెమరామెన్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి  శ్రీకాంత్‌ పట్నాయక్‌ ఎడిటర్‌.

నటీనటులు: నరేష్‌ అగస్త్య, సంగీర్తన విపిన్‌, ఆర్యన్‌ రాజేష్‌, మురళీ శర్మ, ఆమని, శత్రు, అమిత్‌, అభినయ, దేవీ ఫ్రసాద్‌ తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....