అల్లం పద్మ అమ్మకు ఘన నివాళులు

హైదరాబాద్, మార్చి 4 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆమెకు సంబంధించి శుక్రవారం నాడు హైదరాబాద్ జియా గార్డెన్ సోమాజిగూడ లో, పెద్దకర్మ, కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల నుండి  సీనియర్ జర్నలిస్టు జమాల్పూర్ గణేష్, బాల అర్జున్ గౌడ్, చింతకింది సాయి గౌడ్, అంబిలి పూర్ రాజు, జోషి సత్యం, తదితరులు హాజరై అల్లం నారాయణ ను కలిసి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపం వ్యక్తం చేశారు. స్వర్గీయ అల్లం పద్మ చిత్రపటానికి పూల మాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. 

నిజామాబాద్, కామారెడ్డి, జిల్లాలోని అన్ని మండలాల జర్నలిస్టుల పక్షాన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని అల్లం నారాయణ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి జర్నలిస్టులు, మంత్రులు, ఎంపీలు ,ప్రజా ప్రతినిధులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అందరూ అధిక సంఖ్యలో హాజరై నివాళులు అర్పించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....