అలుపెరుగని నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం
హైదరాబాద్ మే 22 ఇయ్యాల తెలంగాణ
అల్ ఇండియా మజ్లీస్ ఏ ఇత్తెహాద్దుల్ ముస్లిమీన్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిత్యావసర సరుకుల కిట్ల పంపిణీ కార్యక్రమం బహదూర్ పుర లో కొనసాగింది. ఎం ఐ ఎం పార్టీ అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఆదేశాల మేరకు కొనసాగుతున్న నిత్యావసర సరుకుల కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బహదూర్ పుర లోని అసద్ బాబా నగర్, కిషన్ బాగ్ తదితర ప్రాంతాల నిరుపేద కుటుంబాలకు సరుకులు పంపిణీ చేయడం జరిగింది. బహదూర్ పుర కార్పొరేటర్ మహమ్మద్ సలీం ఆధ్వర్యంలో సుమారు 200 కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు.