అమెరికా పర్యటన లో Telangana మంత్రులు..!

కోకాకోలా గ్రూప్‌ డైరెక్టర్‌ జోనథన్‌ రీఫ్‌ తో భేటీ

హైదరాబాద్‌, జూన్ 08  (ఇయ్యాల తెలంగాణ) : అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ పరిశ్రమల శాఖామాత్యులు దుద్ధిల్ల శ్రీధర్‌ బాబు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ,  కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, అట్లాంటాలోని కోకా`కోలా హెడ్‌ క్వార్టర్స్‌ లో కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగ గ్రూప్‌ డైరెక్టర్‌ జోనథన్‌ రీఫ్‌  సమావేశమయ్యారు.ఇరువురు నేతలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోకా`కోలా మేనేజ్‌ మెంట్‌ ను ఆహ్వానించారు. దాదాపు గంటన్నర సేపు జరిగిన సమావేశంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులను విజువల్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఎక్కడ ప్లాంట్‌ స్థాపించినా అందుకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని కోకా`కోలా ప్రతినిధులకు మంత్రి శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి హావిూ ఇచ్చారు. భారత దేశంలో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని, గత రెండు దశాబ్ధాలుగా హైదరాబాద్‌ లో అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని మంత్రుల బృందం జోనథన్‌ కు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పట్ల సానుకూలంగా స్పందించిన జోనథన్‌ హైదరాబాద్‌ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. మంత్రులతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ,జయేష్‌ రంజన్‌ పెట్టుబడుల శాఖ స్పెషల్‌ సెక్రెటరీ డాక్టర్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి తో పాటు ఇతర బృందం పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....