అమెరికాలో అంబెద్కర్‌ విగ్రహావిష్కరణ అన్నమయ్య జిల్లా లో సంబరాలు

న్యూఢల్లీ అక్టోబర్ 16 (ఇయ్యాల తెలంగాణ ):భారత రాజ్యాంగ రూపశిల్పి బీఆర్‌ అంబేద్కర్‌ అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని అమెరికా రాజధాని వాషింగ్టన్‌ శివారులోని మేరీల్యాండ్‌లో ఆవిష్కరించారు. అంబేడ్కర్‌ వర్థంతి రోజైన ఈ నెల 14వ తేదీన అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ప్రెసిడెంట్‌ రామ్‌ కుమార్‌ 19 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీగా పిలుచుకునే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి 500 మందికి పైగా భారతీయ అమెరికన్లతోపాటు, భారత్‌, తదితర దేశాల నుంచి కూడా తరలివచ్చారు.అగ్రరాజ్యంలో అంభేధ్కర్‌ విగ్రహం ఏర్పాటుపై అన్నమయ్య జిల్లాలో సంబరాలు జరిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....