అమృత్‌ భారత్‌ పథకం కింద ఇచ్చాపురం రైల్వే పనులు

ఇచ్చాపురం జులై 6, (ఇయ్యాల తెలంగాణ ):సోంపేట, జాడుపూడి, మందస రైల్వే స్టేషన్ల లను రైల్వే అధికారులతో కలిసి ఎంపి రామ్మోహన్‌ నాయుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష పరిశీలించారు. ఈ సందర్భంగా విూడియాతో ఎంపి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గంలో నున్న ఇచ్చాపురం రైల్వే స్టేషన్‌ ను డిఆర్‌ ఎం రింకేష్‌ రాయ్‌, కలిసి పరిశీలించామన్నారు. పలాస రైల్వే స్టేషన్‌ ను అభివృద్ధిచేయాలని డిఆర్‌ఎం కు వివరించి గట్టిగా డిమాండ్‌ చేశామన్నారు. అమృత భారత్‌ పథకం క్రింద పలాస రైల్వే స్టేషన్‌ ను అభివృద్ధి చేసి అందంగా తీర్చి దిద్దుతామన్నారు. పలాసలో నర్సిపురం ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ మూసి వేయడం వలన సుమారు 5000 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని డిఆర్‌ఎం దృష్టిలో పెట్టి పరిష్కరించమని గట్టిగా చెప్పమన్నారు. 30 రోజుల్లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి రీకన్‌ స్ట్రక్షన్‌ పనులు చేపడతామని డిఆర్‌ఎం హావిూ ఇచ్చారని ఎంపి వెల్లడిరచారు. డిల్లీ వెళ్లేటప్పుడు రైల్వే సమస్యలపై పార్లమెంటులో ప్రస్తావించి రైల్వేకు సంబంధించినంత వరకు బాధ్యత తీసుకుంటానని చెప్పారు. మందసలో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి కోసం రూ. 50 లక్షలు మంజూరు చేయించామని తెలిపారు. తాళభద్ర ఎల్‌ సి గేటు దగ్గర గంటల కొద్దీ ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ప్లై ఓవర్‌ బ్రిడ్జి ఏర్పాటు కు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇచ్ఛాపురం, సోంపేట, జడుపూడి, మందస రైల్వే స్టేషన్‌ లలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.విశాఖ పట్నం నుంచి పలాస వరకు వెళ్తున్న మెము రైలు ను ప్రజల అభ్యర్ధన మేరకు ఇచ్ఛాపురం వరకు పొడిగిస్తామని ఎంపి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు హావిూ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఖుర్ద్‌ డివిజన్‌ అధికారులు అభిషేక్‌, గిరీష్‌ నాయర్‌, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు. శిరీష, జిల్లా నాయకులు పలాస నియోజకవర్గం టీడీపీ ముఖ్య నాయకులు టీడీపీ శ్రేణులు, యువత, మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....