అమృత్‌ కలశ్‌ డిపాజిట్‌ FD స్కీమ్‌’ గడువును మరోసారి పొడగించిన SBI

హైదరాబాద్‌ జూన్‌ 30,(ఇయ్యాల తెలంగాణ ): ఎస్‌బీఐ తన ఖాతాదారుల కోసం పున:ప్రవేశ పెట్టిన ‘ఎస్‌బీఐ అమృత్‌ కలశ్‌ డిపాజిట్‌ ఎఫ్‌డీ స్కీమ్‌’ గడువును బ్యాంక్‌ మరోసారి పొడగించింది. ఆకర్షణీయ వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తున్న ఈ ప్రత్యేక స్కీమ్‌ గడువు గతంలో జూన్‌ 30, 2023 వరకు ఉండగా… ఇప్పుడు దానిని ఆగస్టు 15, 2023 వరకు పొడగిస్తున్నట్టు బ్యాంక్‌ ప్రకటించింది. గడువు తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని స్పష్టం చేసింది. కాగా అమృత్‌ కలశ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ డిపాజిట్‌ పిరియడ్‌గా డిపాజిట్‌ పిరియడ్‌ 400 రోజులుగా ఉంది. ఇక దేశీయ రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్స్‌ (రూ.2 కోట్ల కంటే తక్కువ), కొత్త డిపాజిట్లు, డిపాజిట్ల రెన్యూవల్‌, టర్మ్‌ డిపాజిట్స్‌, స్పెషల్‌ టర్మ్‌ డిపాజిట్లు అర్హతగా ఉన్నాయి.. ఇతర వివరాలు ఇవే.టర్మ్‌ డిపాజిట్లు ` మెచ్యూరిటీని బట్టి నెలవారీ/త్రైమాసికం/ అర సంవత్సరం స్పెషల్‌ టర్మ్‌ డిపాజిట్స్‌ ఉంటాయి. వడ్డీ, నికర టీడీఎస్‌ కస్టమర్‌ ఖాతాలో జమవుతాయి. ఇతర విషయాలకు వస్తే.. ఆదాయ పన్ను చట్టం ప్రకారం టీడీఎస్‌ రేటు వర్తిస్తుంది. రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్‌ వర్తింపునకు అనుగుణంగా విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. లోన్‌ సదుపాయం కూడా ఉంది. బ్రాంచ్‌/ఐఎన్‌బీ/యోనో మార్గాల ద్వారా లోన్‌ తీసుకోవచ్చు . 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....