న్యూఢల్లీ, జూలై1 (ఇయ్యాల తెలంగాణ ); కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చిన వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు ముగింపు పలికామని వెల్లడిరచారు. ఇప్పటి నుంచి స్వదేశీ చట్టాలే కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే వీటిని రూపొందించినట్టు తెలిపారు. పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక ఇవి ఆదర్శంగా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని ఎన్నో వర్గాలకు న్యాయం జరిగే విధంగా వీటిని రూపొందించినట్టు వివరించారు. పాత చట్టాలు శిక్షలకే ప్రాధాన్యత ఇస్తే ఈ కొత్త చట్టాలు మాత్రం పూర్తిగా న్యాయం చేయడంపైనే దృష్టి పెడతాయని స్పష్టం చేశారు.న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు ఈ చట్టాలను రూపొందించారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్‌లో న్యాయ సంహిత, సాక్ష్యా అధినియమ్, నాగరిక్ సురక్షా సంహితను తీసుకురానున్నారు. బ్రిటిష్ కాలం చట్టాలకు ముగింపుపలికేలా కీలక మార్పులను కేంద్రం తీసుకొస్తోంది. జీరో ఎఫ్‌ఐఆర్‌తో పాటు ఆన్‌లైన్‌లో ఎక్కడి నుంచైనా పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఎస్‌ఎంఎస్ ద్వారా సమన్లు పంపడం, నేర సంఘటనలను తప్పనిసరి వీడియోగ్రఫీ చేయాలన్న నిబంధన తీసుకురానున్నారు. దాదాపు 163 ఏళ్లుగా ఉన్న చట్టాల స్థానంలో కొత్త చట్టాలు రాబోతున్నాయి. ఉగ్రవాదానికి సరైన నిర్వచనంతో పాటు రాజద్రోహం పదం తొలగించి.. న్యాయ సంహితలో దేశద్రోహం అనే కొత్త పదం చేర్చారు. ఈ సమాజంలో నేరాలను తొందరగా పరిష్కరించేందుకు మార్పులు ఉపయోగపడతాయని కేంద్రం చెబుతోంది. శిక్షలు విధించడం కంటే కూడా న్యాయం అందించడానికి ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుందని అంటున్నారు. అందరికీ న్యాయం అనే ఉద్దేశంతో కొత్త చట్టాలను పూర్తి సవరణలతో తీసుకొచ్చారు. బ్రిటిష్ కాలం చట్టాలను పక్కనపెట్టి కొత్త చట్టాలను భారతీయులే రూపొందించారు.ఏదైనా క్రిమినల్ కేసుల్లో విచారణ ముగిసిన 45 రోజుల్లో తీర్పు ఇవ్వాలి. 60 రోజులలోపు చార్జిషీట్ దాఖలు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. లైంగిక దాడి బాధితుల స్టేట్‌మెంట్‌ను కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో మహిళా పోలీసు మాత్రమే రికార్డ్ చేయాలని చట్టం చేశారు. అలాగే బాధితురాలి వైద్య నివేదికలు 7 రోజుల్లో ఇవ్వాలని, పిల్లలను అమ్మడాన్ని, కొనడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నట్టు చట్టంలో పొందుపరిచారు. మైనర్‌పై గ్యాంగ్ రేప్ జరిగితే జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించే అవకాశం ఉంటుంది. 511 సెక్షన్ల స్థానంలో 358 సెక్షన్లు మాత్రమే ఉండేలా రూపొందించారు. అంతేకాకుండా 18 సెక్షన్లు రద్దు చేశారు. అలాగే సాక్ష్యాలను జాతీయస్థాయిలో ఏర్పాటు చేసిన డిజీ లాకర్‌లో ఉంచనున్నారు. క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానం చేశారు. సాక్ష్యాలను ఆన్‌లైన్‌లో పంపే అవకాశం ఉండనుంది. పెళ్లి చేసుకుంటానంటూ తప్పుడు వాగ్దానాలు ఇచ్చి లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళలను మోసం చేసేవారికి కఠిన నిబంధనలు ఉండనున్నాయి. కొత్త చట్టాల ప్రకారం మహిళలపై నేరాలకు బాధితులు కేసు పురోగతిపై 90 రోజులలోపు అప్‌డేట్ పొందేందుకు వీలు ఉంటుంది. క్రిమినల్ కేసుల విచారణలో ఆలస్యం తగ్గించేందుకు కోర్టులు గరిష్ఠంగా 2 వాయిదాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక నేరాల్లో నిందితుల ఆస్తులు, స్థిర, చరాస్తులను సీజ్ చేసే అధికారం పోలీసులకు కల్పించనున్నారు.
ఇక జీరో ఎఫ్ ఐఆర్
. జీరో ఎఫ్‌ఐఆర్, ఆన్‌లైన్‌లో ఫిర్యాదు, ఎస్‌ఎమ్మెఎస్ ద్వారా సమన్లు జారీ వంటి అత్యాధునిక పద్దతులను కొత్త చట్టాల్లో చేర్చారు. ప్రజలకు న్యాయం చేయడమే ఏకైక ధ్యేయంగా కొత్త చట్టాలు రూపుదిద్దుకున్నాయి. భారతీయత ఉట్టిపడేలా కొత్త చట్టాలకు రూపకల్పన చేశారు. కాలం చెల్లిన బ్రిటిషన్ వలస పాలన చట్టాలను వదిలి నేటి నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. త్వరలోనే భారత శిక్షా స్మృతి, నేర శిక్షాస్మృతి, సాక్షాధార చట్టాలను కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో భారత పార్లమెంట్ ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ చట్టాలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి….భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా…ఇప్పటికీ బ్రిటీష్ ప్రభుత్వం వాసనలు ఇంకా పోలేదు. దేశంలో ఇప్పటికీ బ్రిటీష్‌వారు రూపొందించిన చట్టాలు, శిక్షలు అమలు చేస్తున్నారు. అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా వారికి అనుకూలంగా ఉండే విధంగా ఈ చట్టాలను రూపొందించారు. వలస పాలన నుంచి విముక్తి లభించినా…ఇప్పటికీ భారతీయులకు ఈ చట్టాల నుంచి విముక్తి లభించలేదు. వీటికి చరమగీతం పాడేందుకు గత ప్రభుత్వం హయాంలో మోడీ(ఓూఆఎ) సర్కార్ కొత్తచట్టాలను రూపొందించగా….పార్లమెంట్ ఆమోదించింది. ఇప్పటిక వరకు కొనసాగుతున్న ఐపీసీ( ఎ.ఖ.అ), సీఆర్‌పీసీ( అ.ఖీ.ఖ.అ), భారత సాక్ష్యాధార చట్టాలు కనుమరుగుకానున్నాయి. వాటి స్థానంలో పార్లమెంట్ ఆమోదించిన బీఎన్‌ఎస్(ః.ఔ.ూ.),బీఎన్‌ఎస్‌ఎస్(ః.ఔ.ూ.ూ),బీఎస్‌ఏ(ః.ూ.ం) చట్టాలు ఆదివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి