అన్ని మతాల పండుగలకు సమ ప్రాధాన్యత : పద్మారావు

అన్ని మతాల  పండుగలకు సమ ప్రాధాన్యత : పద్మారావు

హైదరాబాద్, అక్టోబర్ 2 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలకు చెందిన పండుగలకు సమాన ప్రాముఖ్యతను కల్పిస్తోందని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఆయన బతుకమ్మ చీరల పంపీణీ కార్యక్రమాన్ని శనివారం సితాఫలమండీ లో ప్రారంభించారు. ఈ సందర్భాంగా పద్మారావు  మాట్లాడుతూ తెలంగాణా సంస్కృతిని పరిరక్షించడంలో తాము పాటుపడతామని అన్నారు. దసరా పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.బతుకమ్మ ఉత్సవాల ఖ్యాతిని ఖండాంతరాల్లో కూడా వ్యాపింప చేశామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో దాదాపు 60 వేల మందికి బతుకమ్మ చీరలను పంపిణీ చేసిందుకు ఏర్పాట్లు జరుపుతున్నామని, 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి మహిళకు రేషన్ కార్దు తో చీరను అందిస్తామని తెలిపారు. 

ఈ కార్యక్రమం లో డిప్యూటీ మేయర్  మోతే శ్రీలత శోభన్ రెడ్డి,  కార్పొరేటర్లు  సామల హేమ, రాసురి సునీతా, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, జోనల్ కమీషనర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి,  డిప్యూటీ కమీషనర్  పల్లె మోహన్ రెడ్డి, తెరాస కార్మిక విభాగం నేత మోతె శోభన్ రెడ్డి, తెరాస  యువ నేత  తీగుల్ల రామేశ్వర్ గౌడ్, నికిల్ గౌడ్ ,రూపేష్,  నేతలు,  TRS నగర సంయుక్త కార్య ధరిషి గుండవేణి రాజేశ్ గౌడ్,  Dr.  గంగాధర్ కటకం, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....