అధిక రక్తపోటుపై (High BP) అప్రమత్తత అవసరం

హైదరాబాద్‌, మే 18 (ఇయ్యాల తెలంగాణ) : అధిక రక్తపోటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ వైద్య నిపుణులు డా.శ్రీధర్రెడ్డి అన్నారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా విూడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 60 ఏళ్లు దాటిన వారిలో అధిక రక్తపోటు ఉండేదని, ప్రస్తుతం చిన్న వయసు వారిలోనూ ఈ సమస్య కనిపిస్తోందన్నారు. దీనికి ప్రధానంగా మారుతున్న ఆహారపు అలవాట్లు, లైఫ్‌ స్టైల్‌, వంశపారంపర్యంగా వచ్చే బాధితులు ఉన్నట్లు తెలిపారు. అధిక రక్తపోటు ప్రారంభం లో ఉదయాన్నే తలనొప్పి, తల బరువుగా అనిపించడం, కళ్లు మసకబారడం, గుండెదడ తదితర లక్షణాలు కని పిస్తాయన్నారు. ఇటువంటి సమయంలో వైద్యుల సలహా మేరకు మందులు వాడాలన్నారు. అలసత్వం వహిస్తే పక్షవాతం, బ్రైన్‌ ట్యూమర్‌, కళ్లు, కిడ్నీ, సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎక్కువ టెన్షన్‌ తీసుకోవడం తగ్గించు కోవాలని, సమయాను కూలంగా నిద్ర, కొంత సమయం నడక అవసరం అన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒక దఫా పరీక్షలు చేయించుకోవడం మంచిదన్నారు. కుడి చేతికి, ఎడమ చేతికి రక్తపో టులో తేడా ఉండొచ్చని, డిజిటల్‌ విూటర్లలో రక్తపోటు నివేదికలు ఖచ్చితమైనవి కాకపోవచ్చని ఆరోపించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....