అకుంఠిత దీక్ష పరులు లాల్ బహదూర్ శాస్త్రి : BJP నేత KUMAR

అకుంఠిత దీక్ష పరులు లాల్ బహదూర్ శాస్త్రి : BJP నేత KUMAR

 హైదరాబాద్, అక్టోబర్ 2 (ఇయ్యాల తెలంగాణ) : మహాత్మ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను పురస్కరించుకొని నవతరంగిణి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుల్తాన్ షాహీ ప్లే గ్రౌండ్ లో జయంతి వేడుకలను నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు ప్రేమ్ రాజ్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి గోల్కొండ ఉపాధ్యక్షులు ఎం. కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన జాతిపిత మహాత్మా, భారత మాజీ ఉప ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కుమార్ మాట్లాడుతూ దేశం కోసం పాటుపడిన మహాత్ముల జీవితాల గురుంచి ఎంత స్మరించు కున్నా తక్కువే అవుతుందని తెలిపారు. 

లాల్ బహదూర్ శాస్త్రి అకుంఠిత దీక్ష పరుడని కొనియాడారు. ఆయన ప్రధానిగా ఉంది కూడా కడు పేదరికాన్ని అనుభవించాడని ఈ సందర్బంగా గుర్తుచేశారు. నీతి, నిజాయితీకి శాస్త్రి నిలువెత్తు నిదర్శనమని ఆయన తన పిల్లలను కూడా చదివించుకోలేని స్థితిలో కూడా దేశ హితం కోసమే పాటు పడ్డారని అలాంటి వారి జీవితాలను ఎంత స్మరించుకున్నా తక్కువే అని పేర్కొన్నారు. అనంతరం అందరు కలసి సమీప ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పి. లక్ష్మణ్, ఏ. శ్రీనివాస్, యూ. రాకేష్ నవ తరంగిణి ప్రధాన కార్యదర్శి కె. నాగరాజ్ కమిటీ సభ్యులు మహేందర్, బి. దాస్, అజయ్ (దీపక్), దేవి సింగ్, సునీల్ తివారి తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....