బద్వేలు ఆగష్టు 10 (ఇయ్యాల తెలంగాణ ): బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల పట్టణంలో ఇటీవల జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు చేదించారు. నలుగురు దొంగలను అదుపులోకి తీసుకొని వారి నుంచి తొమ్మిది తులాలు బంగారు కేజీ వెండిని పోరుమామిళ్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు డిఎస్పి వంశీధర్ గౌడ్ పోరుమామిళ్ల సిఐ సురేష్ రెడ్డి ఎస్‌ఐ మల్లికార్జున రెడ్డి తెలిపారు. డిఎస్పి వంశీధర్ గౌడ్ మాట్లాడుతూ పోరుమామిళ్ల పరిసర ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. నలుగురు దొంగలను అరెస్టు చేసినట్లు తెలిపారు. బుధవారం బ్రహ్మంగారిమఠం మండలం లింగాలదిన్నె పల్లె గ్రామ సవిూపంలో అనుమాస్పదంగా ద్విచక్ర వాహనంలో పట్టుబడ్డారని నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి బంగారు వెండి వస్తువులు స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన తెలిపారు. నలుగురి నిందితులపై ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాలలో కరుడుగట్టిన నేరాలు చేసే నిందితులని కేసులు నమోదయ్యాయని వారు తెలిపారు……
- Homepage
- General News
- అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. బంగారు వెండి.. స్వాధీనం
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. బంగారు వెండి.. స్వాధీనం
Leave a Comment