కమాన్ పూర్ ఆగష్టు 22 (ఇయ్యాల తెలంగాణ ):పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని ఎనిమిదవ కాలనీకు చెందిన కాంటే రాధా మలేషియాలో జరిగే ఈవెంట్స్ కు ఎన్నికయ్యారుమలేషియాలో సెప్టెంబర్ 16,17న జరిగే ఈవెంట్ కు తెలంగాణ నుండి భారత టీము ఢల్లీి నుండి ప్రయాణంమలేషియాలోని కౌలాలంపూర్ లో సెప్టెంబర్ 16, 17వ తేదీలలో 35వ మలేషియన్ ఇంటర్నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్`2023 పోటీలలో 45G మహిళల విభాగంలో 100విూటర్లు, 200విూటర్లు, 400విూటర్లు, 800విూటర్లు పరుగు పందెం పోటీలలో పాల్గొనుటకు నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్(ఇండియా) తరుపున పెద్దపల్లి జిల్లా రామగుండం 8వ కాలనీకి చెందిన కాంటెవాడ రాధ(46) ఎన్నికకాబడ్డారని నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్, ఇండియా సెక్రెటరీ జనరల్ రాంపాల్ శర్మ పంపిన ఎంట్రీ లిస్ట్ ద్వారా తెలిపారు.ఇటీవల హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో ఒక బంగారు, రెండు రజితం, ఒక కాంస్య పతకాలు సాధించిన రాధ సింగరేణి ఉద్యోగి కాంటేవాడ బుగ్గాజీ సతీమణి. ఈ సందర్భంగా సెప్టెంబర్ రెండవ వారంలో భారత దేశ టీము ఢల్లీి నుండి బయలుదేరే ఈ ఈవెంటులో పాల్గొనుటకు ప్రోత్సహించి, సహకరించిన తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు మర్రి లక్ష్మారెడ్డి, ప్రభుకుమార్ గౌడ్, సభ్యులు గజవెల్లి పురుషోత్తం, కల్లెం మహేందర్ రెడ్డి, తన భర్తయగు కాంటేవాడ బుగ్గాజీకి రాధ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. వారు తనపై నమ్మకానికి తగ్గ ప్రతిభ చూపి పతకాలను సాధించడానికి ప్రయత్నిస్తానని, దానికోసం రోజు సాధన చేస్తున్నట్లు తెలిపింది.
- Homepage
- General News
- అంతర్జాతీయ స్థాయి పరుగుపందెం పోటీలకు ఎన్నికైన కాంటెవాడ రాధ
అంతర్జాతీయ స్థాయి పరుగుపందెం పోటీలకు ఎన్నికైన కాంటెవాడ రాధ
Leave a Comment