👉 ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్
👉 సెల్ఫ్ అసెన్మెంట్‌పై అనేక అవకతవకలు
👉 ప్రాపర్టీ టాక్స్‌పై ఆదాయం తగ్గుతున్నా.. పట్టించుకోవడం అధికారులు
👉 కౌన్సిల్లో అధికారులను నిలదీసిన కార్పొరేటర్లు
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఇయ్యాల తెలంగాణ) : : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా కొనసాగింది. హైదరాబాద్‌లో సమస్యలపై కార్పొరేటర్లు కౌన్సిల్లో ప్రస్తావిస్తూ అధికారులను నిలదీస్తున్నారు. అలాగే ప్రాపర్టీ టాక్స్‌పై కౌన్సిల్లో చర్చ జరిగింది. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ తీసుకుంటున్నారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు తెలిపారు. సెల్ఫ్ అసెన్మెంట్‌పై అనేక అవకతవకలు జరుగుతున్నాయన్నారు. ప్రాపర్టీ టాక్స్‌పై చాలా ఆదాయం తగ్గుతున్నా.. అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రెసిడెన్షియల్‌ను కమర్షియల్‌గా మారుస్తున్నప్పటికీ టాక్స్ కలెక్ట్ చెయ్యకపోవడంతో జీహెచ్ఎంసీ ఆదాయం కోల్పోతుందని బీఆర్ఎస్ కార్పొరేటర్లు వెల్లడిరచారు.
బీజేపీ కార్పొరేటర్లు మాట్లాడుతూ.. టాక్స్ వసూలు చేస్తున్నాము కానీ ఎంత వరకు వారికి మౌలిక సదుపాయాలు అందిస్తున్నామని ప్రశ్నించారు. జనానికి కనీసం పార్కింగ్ సదుపాయం కల్పించడం లేదన్నారు. హైటెక్ సిటీ, సరూర్‌నగర్‌లో ఒకే లాగా టాక్స్ వసూలు ఎట్లా చేస్తున్నారని నిలదీశారు. టాక్స్‌పై అధికారుల నిర్లక్ష్యంగా వహిస్తున్నారని మండిపడ్డారు. టాక్స్ కలెక్షన్ విభాగంపై క్రెడెబిలిటీ లేదన్నారు. తీసుకునే పర్మిషన్ ఒక్కటి.. అక్కడ నడిపించేది ఒక్కటి అంటూ బీజేపీ కార్పొరేటర్లు వ్యాఖ్యలు చేశారు.