హైదరాబాద్ జులై 7, (ఇయ్యాల తెలంగాణ ):
`కరీంనగర్ ?వరంగల్ ప్రజల చిరకాల వాంఛ 4 లేన్ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు
`తెలంగాణలో పలు అభివ్రుద్ధి పనులను ప్రారంభించబోతున్నారు
` విూవల్లే బీజేపీ అధికారంలోకి వచ్చే వాతావరణం ఏర్పడిరది
`రేపు కనీవినీ ఎరగని రీతిలో జరగబోయే బహిరంగ సభను సక్సెస్ చేయండి
‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ నరేంద్రమోదీ వచ్చేది మనందరి కోసమే. జిల్లా ప్రజల చిరకాల వాంఛగా ఉన్న కరీంనగర్ ?వరంగల్ 4 లేన్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. దీంతోపాటు వేల కోట్ల రూపాయలను కేటాయించి తెలంగాణ ప్రజల కోసం అనేక అభివ్రుద్ది పనులను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో రేపు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ లో జరగబోయే భారీ బహిరంగ సభకు కనీవినీ ఎరగని రీతిలో తరలివచ్చి సక్సెస్ చేయండి’’అని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈరోజు ఉదయం తన కార్యాలయంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నేతలు, శక్తి కేంద్ర ఇంఛార్జీలతో బండి సంజయ్ సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, అధికార ప్రతినిధి రాణిరుద్రమదేవి, జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, సీనియర్ నేత బాస సత్యనారాయణరావు, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దరువు ఎల్లన్న, తాళ్లపల్లి శ్రీను, వాసుదేవరెడ్డి, కోమాల అంజన్న, రమేశ్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటేప్రధానమంత్రి నరేంద్రమోదీ మనందరి కోసమే రేపు వరంగల్ జిల్లాకు వస్తున్నారు. జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన కరీంనగర్ ?వరంగల్ 4 లేన్ విస్తరణ పనులకు స్వయంగా శంకుస్థాపన చేయబోతున్నారు. దీంతోపాటు అనేక అభివ్రుద్ధి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా జరగబోయే బహిరంగ సభకు పెద్ద ఎత్తున హాజరై కనీవినీ ఎరగని రీతిలో సక్సెస్ చేయాలి. రేపు ఉదయమే సభ జరగబోతున్నందున నిర్ణీత సమాయానికంటే ముందే సభాస్థలికి రావాలి.ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. మనందరి లక్ష్యం తెలంగాణలో రామరాజ్య స్థాపనే. విూ అందరి కమిట్ మెంట్, పోరాట పటిమవల్లే ఈరోజు తెలంగాణలో బీజేపీకి అధికారం వస్తుందనే వాతావరణం ఏర్పడిరది. విూరు తెగించి కొట్లాడటంవల్లే ప్రజలు ఆదరిస్తున్నారు.
కొంతమంది బీజేపీకి వచ్చిన వాతావరణాన్ని చెడగొట్టేందుకు అనేక అనుమానాలను, అపోహలను స్రుష్టిస్తున్నారు. వాటికి తావివ్వకుండా అందరం కలిసి కట్టుగా పని చేయాలి. ప్రస్తుతం మోదీ బహిరంగ సభను సక్సెస్ చేయడమే మనముందున్న కర్తవ్యం. భారీ ఎత్తున తరలివెళ్లి కార్యకర్తల సత్తా చాటండి.