తండ్రి చివరి చూపుకు నోచుకోని పిల్లలు
తల్లడిల్లేలా చేసిన న్యాయవాది మరణం
జగిత్యాల, మే 4 (ఇయ్యాల తెలంగాణ ): కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారిని చివరి చూపునకు కూడా నోచుకోకుండా చేస్తోంది. పిల్లల ఉన్నతిని కాంక్షిస్తూ వారిని విదేశాలకు పంపిస్తే.. అక్కడి నుంచే ఆన్లైన్లో అంత్యక్రియలను చూడాల్సి వస్తుందని వారు కలలో కూడా అనుకొని ఉండరు. ఈ హృదయ విదారకర సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్.. చివరకు కనిపెంచిన వారిని చివరి చూపునకు కూడా నోచుకోకుండా చేస్తోంది. తండ్రి చనిపోతే తలకొరివి పెట్టాల్సిన కొడుకు రాలేని దుర్భర పరిస్థితి. చివరకు బంధువులు, స్నేహితులు స్వగ్రామంలో తండ్రి అంత్యక్రియలు నిర్వహిస్తుంటే, ఆన్లైన్లో చూసి దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు. జగిత్యాల జిల్లా గొల్ల పల్లి మండం రాఘవపట్నం గ్రామానికి చెందిన వూట్కూరి అశోక్‌రెడ్డి జగిత్యాల జిల్లా కేంద్రంలో సీనియర్ న్యాయవాదిగా పని చేస్తున్నాడు. ఈయనకు ఇద్దరు పిల్లలు. కూతురు అమెరికాలో ఉంటుండగా, కొడుకు న్యూజిలాండ్‌లో ఉంటున్నాడు. కొంతకాంగా అనారోగ్యానికి గురైన అశోక్‌రెడ్డి ఆదివారం మృతిచెందాడు. కరోనా లాక్‌డౌన్‌తో అంతర్జాతీయ విమానాలు నడవకపోవడంతో, ఇతర దేశాల్లో ఉన్న కొడుకు, కూతురు రాలేక పోయారు. దీంతో ఆయా దేశాల్లో ఉన్న వారి పిల్లలు నాన్న అశోక్‌రెడ్డికి తలకొరివి పెట్టే పరిస్థితి లేక అక్కడే తండ్రిని తలుచుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి చివరి చూపునకు పిల్లలు నోచుకోలేక పోయారని ఆయన భార్య విలపించడం అంత్యక్రియలకు హాజరైన వారికి కన్నీళ్లు తెప్పిచింది. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో వారి బంధువులతో తకొరివి పెట్టించి అశోక్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి చేశారు. 5 ఏళ్లుగా సివిల్, క్రిమినల్ కేసులు వాదించిన ఆయన.. ఆ గ్రామానికి రెండుమార్లు సర్పంచ్‌గా సైతం పని చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పార్టీ పటిష్టతకు కృషి చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, అశోక్‌రెడ్డి మృతిదేహంపై బీజేపీ జెండా కప్పి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు మోరపల్లి సత్యనారాయణరావు, గుజ్జు రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాజోజి భాస్కర్, ఏసీఎస్ రాజు, ఇతర పార్టీ నాయకు, జగిత్యా బార్ అసోసియేషన్ న్యాయవాదు అంత్యక్రియల్లో పాల్గొని నివాళుర్పించారు.