మాతృదినోత్సవం పురస్కరించుకొని నిత్యావసర సరుకుల పంపిణి
హైదరాబాద్ , మే 12,ఇయ్యాల తెలంగాణ: జై భీమ్, మాతృదినోసవం సందర్బంగా నిత్యావసర వస్తువులు పంపిణి చేయడం జరిగింది. ఎస్సీ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రోజు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పులికంటి నరేష్ చేతులమీదుగా పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగినది,
ఈ సందర్బంగా అధ్యక్షులు పులికంటి నరేష్ మాట్లాడుతూ అందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, కొరోనా వాళ్ళ పేద ప్రజలు బయటకు వెళ్లి రోజువారీ కూలి చేయలేని పరిస్థిలులో ఉన్నారని అందువల్ల నాతో తోచినంత సహాయం చేస్తున్నాను కావున ప్రతిఒక్కరు కూడా తమకు తోచిన విధంగా నిరుపేద ప్రజలకు సహాయం చేయాలనీ పిలుపు నిచ్చారు.ఎందరో నిరుపేదలు కరోనా మూలంగా పస్తులుంటున్నారని గుర్తు చేశారు.
కావున కష్ట కాలంలో ప్రతి ఒక్కరు చేయూతనందించాలని తెలిపారు. కరోనా ని తరిమికొట్టే క్రమంలో అందరు లాక్ డౌన్ నియమాలు పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, శేఖర్ గారు , సునీల్ గారు, పండు గారు, మధు గారు , ఆనంద్ గారు , స్వామి గారు, యొనగారు, తదితరులు పాల్గొన్నారు.