.
అంబాజీపేట జులై 6,(ఇయ్యాల తెలంగాణ ): సినీనటుడు సుమన్ ఏపీలో మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన సినీ నటుడు సుమన్ జోస్యం చెప్పారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు హీరో సుమన్ పూజలు జరిగిపారు. సుమన్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఏపీ లో మళ్ళీ జగనే సీఎం అవుతారు. ప్రతిపక్షాల పొత్తుల విషయంలో ఇంకా క్లారిటీ లేదు సిఎం ఎవరో కూడా తెలియని కన్ఫూజన్ లో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వెనుకబడిన కులాలు జగన్ వెంటే ఉన్నారు. జగన్ లా మేనిఫెస్టో అమలుచేసిన వారు భారతదేశంలో ఎవరు లేరు. నవరత్నాలు 95శాతం అమలు చేశారు. కరోన సమయంలో చేసిన సాయం ఎవరు మర్చిపోలేదని అయన అన్నారు. పుల్లేటికుర్రు లో శ్రీ చౌడేశ్వరి దేవి సమేత రామలింగేశ్వరి ఆలయంలో సుదర్శన యాగం లో అయన పాల్గొన్నారు.