భాజపా కరోనా వారియర్స్ టీమ్ సనత్ నగర్ సేవలు స్ఫూర్తిదాయకం: మాజీ మంత్రి బాబు మోహన్
హైదరాబాద్ మే 16 (ఇయ్యాల తెలంగాణ ) భాజపా మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు యేచన్ సురేష్ సీనియర్ నాయకుడు ఆకూరి శ్రీనివాస్ రావు నేతృత్వంలో భాజపా హైదరాబాద్ కరోనా వారియర్స్ టీమ్ సనత్ నిర్వహిస్తున్న”ఫీడ్ ది నీడి” కార్యక్రమం దిగ్విజయంగా 50 రోజులు పూర్తి కావడంతో శనివారం 51 వ రోజు కరోనా వైరస్ నేపథ్యంలో “లాక్ డౌన్” వల్ల ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు, దినసరి వేతన కూలీలు, ఆకలికి అలమటించవద్దన్నఉద్దేశంతో జాతీయ, రాష్ట్ర మరియు నగర అధ్యక్షుల సూచనల మేరకు సనత్ నగర్ ప్రాంతంలో నివసిస్తూ ఇతర రకంగా లబ్దిపొందలేకపోతున్న 125 కుటుంబాలను ప్రత్యేకంగా గుర్తించి సనత్ నగర్ బస్సు స్టాండ్ సమీపంలో ఎస్ ఆర్ టి 167 ఎదురుగా గల వీర్ సావర్కర్ పార్క్ లో పక్షం రోజులకు సరిపడ 18 రకాల నిత్యావసర సరుకులు, శానిటైజర్ లు, మాస్క్ లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం కుందనం మోహన్ అతిథులను శాలువాలతో సత్కరించారు.
నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన భాజపా నాయకులు మాజీ కార్మిక మంత్రి బాబు మోహన్, భాజపా రాష్ట్ర మహిళాధ్యక్షురాలు ఆకుల విజయ లు “కరోనా వారియర్స్ టీమ్ సనత్ నగర్” ఈ క్లిష్ట సమయంలో “మానవ సేవే మాధవ సేవ” అనే నానుడిని నిజం చేస్తూ గత 51 రోజులుగా నిస్వార్ధంగా ఆహారం, నిత్యావసర వస్తువులు, శానిటైజర్ లు, మాస్కులు అందచేయడం ఎంతో శ్లాఘనీయమన్నారు. కార్యక్రమానికి ఆత్మీయ అతిథి గా విచ్చేసిన భాజపా నగర లింగ్విస్టిక్ కన్వీనర్ భవర్ లాల్ వర్మ మాట్లాడుతూ యేచన్ సురేష్, ఆకూరి శ్రీనివాస్ రావు, పి సునీల్ కుమార్ , పొలిమేర సంతోష్ కుమార్ లు ఈ కార్యక్రమాన్ని ఏదో ఆరంభ శూరత్వంగా కాక అకుంఠిత దీక్షతో కొనసాగించడం తమను ఎంతగానో ఆకట్టుకుందన్నారు.
యేచన్ సురేష్ మాట్లాడుతూ తమ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రోద్బలంతో జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మరియు నగర అధ్యక్షుడు నారపరాజు రాంచందర్ రావు ల ఆదేశాలను శిరోధార్యంగా భావిస్తూ నిరంతరాయంగా “ఫీడ్ ది నీడి” కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, దాతల సహకారంతో నిర్వహించ గలుగుతున్నామన్నారు.
వీర్ సావర్కర్ పార్క్ గ్రౌండ్ సభ్యులు ఎం విష్ణుమూర్తి, బి సురేష్, ఏ ఎన్ సతీష్ కుమార్, బి హనుమంతరావు, సతీష్ కుమార్, రజనీష్ కుమార్ (బంటీ), విక్రమ్, విశాల్, ఆనంద్ లు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మరియు ఆత్మీయ అతిథికి ధన్యవాదాలు తెలియచేసారు.
ఈ కార్యక్రమానికి భాజపా యువమోర్చా నాయకులు పి సునీల్ కుమార్, ఆకుల ప్రతాప్, దళిత మోర్చా నాయకుడు పొలిమేర సంతోష్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తాళ్ళ జైహింద్ గౌడ్, దశరథ్ గౌడ్, ఎన్ శివప్రసాద్, శశాంక్ ఆర్య, సాయి రాథోడ్ (బాపూ నగర్), రాజు, విట్టల్ మురళి, లక్ష్మణ్ పటేల్, బోలేనాథ్, శంకర్, విజయ్, కాసాని శివప్రసాద్ గౌడ్, సరిత శ్రీనివాస్ గౌడ్, అరుణ్ గౌడ్, గోలి వెంకటపతి, మిథుల్ రాజ్, ఫణిమాల, దీపక్, కార్తీక్ వారణాసి, కిషోర్, ధర్మేంద్ర, భాను, సన్నీ రాజ్, లలన్ భాయి, భరత్, విజయ్ బిడ్లన్, జె కె ఠాకూర్, ఢోలక్ సత్యనారాయణ కుమారుడు రాజు తదితరులు సహకారం అందించారు.