చార్మినార్, సెప్టెంబర్ 11 (ఇయ్యాల తెలంగాణ) : చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని అలహాబాద్ హై కోర్ట్ జస్టిస్ రాకేష్ శ్రీ వాస్తవ్ దర్శించుకున్నారు. శనివారం ఆయన సకుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని భాగ్యలక్ష్మీ అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందారు. ఈ సందర్బంగా ఆలయ ట్రస్టీ శశికళ ఆధ్వర్యంలో ఆయనకు ఆలయ ఆచారం ప్రకారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి శాలువాతో సత్కరించారు.