దశాబ్దాల కల సాకారం
Add caption

సనత్ నగర్ – బాలానగర్ మధ్య రోడ్ అండర్ బ్రిడ్జికి ప్రభుత్వ ఆమోదం:
హర్షం వ్యక్తం చేస్తున్న సనత్ నగర్ వాసులు
హైదరాబాద్,మే 28 ( ఇయ్యాల తెలంగాణ )
సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుండి బాలానగర్ నర్సాపూర్ క్రాస్ రోడ్ వరకు రోడ్ అండర్ బ్రిడ్జి నిర్మాణానికి నేడు తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయడాన్ని భాజపా మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యేచన్ సురేష్ స్వాగతించారు. దశాబ్దాల తరబడి తాము ఆందోళన చేపడుతున్న ఈ డిమాండ్ పరిష్కారానికి నోచుకోవడం తమకు ఎంతో ఆనందాన్నిస్తుందన్నారు. బంగారు తెలంగాణ సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ ఆర్ డి పి) లో భాగంగా హైదరాబాద్ నగరంలో రహదారుల విస్తరణ మరియు సుందరీకరణ పనులు చేపడుతున్న దరిమిలా సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుండి బాలానగర్ నర్సాపూర్ క్రాస్ రోడ్ వరకు రోడ్ అండర్ బ్రిడ్జి లేదా రోడ్ ఓవర్ బ్రిడ్జి ప్రతిపాదనను ఆమోదింపచేయవలసిందిగా దాదాపు నాలుగు నెలల క్రితం రాష్ట్ర పశు సంవర్థక శాఖ మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గృహం లో జరిగిన సమావేశంలో తాను ప్రస్తావించానని సురేష్ తెలిపారు.
![]() |
Add caption |
ఎన్ డి ఏ ప్రభుత్వ హయాంలో దివంగత డా బంగారు లక్ష్మణ్ రైల్వే శాఖ మంత్రిగా వున్నపుడు వారికి ఫతేనగర్ బ్రిడ్జి ఇరుకుగా ఉండడం వలన ప్రజావసరాలను ఆశించిన స్థాయిలో తీర్చలేకపోవడం మరియు విస్తరణకు భారీ వ్యయం కానున్నందున యేచన్ సురేష్ నేతృత్వంలోని భాజపా ప్రతినిథి బృందం నాటి సనత్ నగర్ తెలుగు దేశం మిత్రపక్షం శాసన సభ్యులు దివంగత శ్రీపతి రాజేశ్వర్ గారి ద్వారా అతి తక్కువ వ్యయంతో సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుండి బాలానగర్ నర్సాపూర్ క్రాస్ రోడ్ వరకు రోడ్ అండర్ బ్రిడ్జి లేదా రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మించడం ద్వారా ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రతిపాదన సమర్పించారు. కాగా నాటి మున్సిపల్ కమిషనర్ పి కె మొహంతి గారిని సాధ్యాసాధ్యాల రిపోర్ట్ సమర్పించవలసిందిగా మంత్రి గారు ఆదేశించడం, వారు ఆ బాధ్యతను ఏ వి ఎస్ రెడ్డి గారికి అప్పచెప్పడం జరిగింది. దీనివల్ల ముంబై రహదారిపై రద్దీ తగ్గడమే కాక కేవలం నాలుగు నిమిషాలలో సనత్ నగర్ నుండి బాలానగర్ నర్సాపూర్ క్రాస్ రోడ్ చేరుకోవచ్చు.
యేచన్ సురేష్
మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు
భాజపా సనత్ నగర్