ఆలేరు, మార్చి 25 (ఇయ్యాల తెలంగాణ) : ప్రజల పక్షాన పోరాడే ఏకైక పార్టీ వైఎస్సార్ టీపీ పార్టీ అని ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర లో భాగంగా 35వ రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేర్ నియోజకవర్గం ఆత్మకూరు మండలం పారుపల్లీ గ్రామంలో పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ నుండి ఉప్పల పహాడ్, రాపాక, కప్రాయిపల్లి, గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగుతు తుంగతుర్తి నియోజకవర్గానికి చేరింది. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి మొత్కుర్ మండల కేంద్రానికి చేరి మాటా ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్ధానిక అంబేద్కర్, పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఎర్రభోళ్ళ భూములను ప్రభుత్వమే దగ్గరుండి అన్యాక్రాంతం చేస్తుందని మండి పడ్డారు. సర్వే నంబర్ 279లో సుమారుగా 127ఎకరాల భూమి ఉందని, ఆ భూముల్లో గిరిజనులు, గొల్ల కురుమలు బర్లు,గొర్లు, కాసుకుంటు జీవనం సాగిస్తున్నారని,అలాంటి భూములను టిఆర్ఎస్ ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా మైనింగ్ కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని పైర్ అయ్యారు.
అలాంటి భూములు కబ్జా కాకుండా, అటవీ శాఖ తన ఆదీనంలోకి తిసుకోకుండా వాటిని పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇక రాష్టంలో రైతుల బతుకులను కేసీఆర్ అధోగతి పాలు చేశారని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చే పంటలను వేయనియకుండా అడ్డుపడి రైతులను అప్పులపాలు చేసి కేసీఆర్ దర్జాగా సేద దీరుతున్నాడని షర్మిల మండి పడ్డారు. కరేంటు, ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలను కేసీఆర్ నిండా ముంచుతున్నారని అన్నారు. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏలాంటి చార్జీలు పెంచకుండా గోప్ప పరిపాలన అందించారని కొనియాడారు. రాజ శేఖర్ రెడ్డి పాలనలో ఎంతోమందికి ఋణ మాఫీ చేస్తే కేసీఆర్ మాత్రం రాష్టాన్ని అప్పుల పాలు చేశాడని అన్నారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న చైతన్య రెడ్డి, వాడుక రాజగోపాల్, నీలం రమేష్, సత్యవతి తదితరులు పాల్గొన్నారు