పేద ప్రజల ఆకలి తీర్చాడానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలి.. AIMIM
హైదరాబాద్, మే 22 (ఇయ్యాల తెలంగాణ )
హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు, ఎం ఐ ఎం పార్టీ అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసి ఆదేశాల మేరకు ఈ రోజు దూద్ బౌలి డివిజన్ లోని పలు ప్రాంతాల పేద ప్రజలకు నిత్యావసర సరుకుల రేషన్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. దూద్ బౌలి డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ గఫ్ఫార్ ఆధ్వర్యంలో సాలార్ ఏ మిల్లత్ కమ్మూనిటీ హాల్ లో సుమారు 200 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. ఈ సందర్భంలో కార్పొరేటర్ మాట్లాడుతూ పేద ప్రజల ఆకలి తీర్చడానికి తమ స్వంత డబ్బులతో ప్రజలందరికి నిత్యావసర సరుకుల కిట్లను అందజేస్తున్న అసదుద్దీన్ కుటుంబానికి, అక్బరుద్దీన్ కు నూరుద్దీన్ కు మంచి ఆయురారోగ్యాలు భగవంతుడు మనందరి తరపున ప్రసాదించాలని కోరుకుందామని తెలిపారు. ఈ కార్యక్రంమలో ఎం ఐ ఎం పార్టీ నాయకులు పాల్గొని ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకుల కిట్లు అందేలా కృషి చేశారు.