సనత్ నగర్, జూన్ 29 (ఇయ్యాల తెలంగాణ) : కళ కోసం సర్వం అర్పించి పాటే ప్రాణంగా జీవిస్తూ ఎన్నో పాటలు పాడి ప్రజలను ఉత్తేజ పరుస్తూ ముందుకు సాగుతూ ఎన్నో మన్ననలు పొందిన మన ఎన్ వై ప్రవీణ్ మేడ్చల్ జిల్లా తూముకుంట మునిసిపల్ దేవరయాంజల్ కి చెందిన వారు ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం సందర్భంగా సరికొత్త పాట పాడడం జరిగింది. ఈ పాటని మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఆవిష్కరిం చడం జరిగింది. పాటని విడుదల చేసిన వారిలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ ఈఓ అన్నపూర్ణ భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా నాయకుడు పొలిమేర సంతోష్ కుమార్ ఉన్నారు. ఈ మహోత్సవంలో సింగర్ ప్రవీణ్ ని దీవిస్తూ మంత్రి తలసాని ఇలాంటి ఇంకెన్నో పాటలు పాడి వారికి ప్రోత్సాహం అందించాలని కోరారు. కళాకారులకి మేము ఎల్లవేళలా అండగా నిలుస్తూ వెన్నంటే ఉండి ప్రోత్సాహం అందిస్తానని మంత్రి మాటిచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ పాటను ఆయుష్మాన్ ఎంటర్టైన్మెంట్స్ అని యూట్యూబ్ ఛానల్ లో విని ఆనందిచాలని సింగర్ ఎం వై ప్రవీణ్ కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎంఆర్పిఎస్ తెలంగాణ స్టేట్ లీడర్స్ శ్రవణ్ కుమార్ పొలివెర సంతోష్ కుమార్ పాల్గొన్నారు.