గుంటూరు జూలై 1, (ఇయ్యాల తెలంగాణ ): జనసేనాని పవన్‌పై మరోసారి ధ్వజమెత్తారు మంత్రి అంబటి రాంబాబు.. పవన్ పంది విూద ఊరేగుతున్న పిచ్చికుక్క.. పెళ్లిళ్ల వీరుడు పవన్ కల్యాణ్.. అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. భీమవరం వేదికగా ప్రభుత్వంపై పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన అంబటి.. ఢల్లీిలో పెద్దలలో నీకు సన్నిహిత సంబంధం ఉంటే రాష్ట్రానికి మేలు చేయ్.. సీఎం జగన్ ను బెదిరిస్తున్నావా..? మతి భ్రమించి మాట్లాడుతున్న పవన్ లో పిచ్చి కుక్క లాంటి వాడు అంటూ మండిపడ్డారు. జగన్ రాజకీయాన్ని చూసి నేర్చుకో.. తప్పుడు కేసులు పెట్టినా జగన్ భయపడ కుండా పోరాటం చేశాడని గుర్తుచేశారు. నలుగురు విప్లవ కారులు పేర్లు తెలిస్తే నువ్వు విప్లవ కారుడివా..? వివాహ వ్యవస్థలో విప్లవం తెచ్చావా? అంటూ సెటైర్లు వేశారు.వివాహ వ్యవస్థ పై నీకు నమ్మకం లేదు.. పెళ్లిళ్ల వీరుడు పవన్ కల్యాణ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. అలాంటి వ్యక్తి ప్రజలకు నీతులు చెప్తున్నాడు.. పేదలకు, పెత్తందార్ల మధ్య పోరాటంలో జగన్ పేదల పక్కన నిలబడితే పవన్, చంద్రబాబు పక్కన చేరాడని విమర్శించారు. పవన్ మాటలు సంస్కార హీనంగా ఉన్నాయి.. పవన్ మాటలతో అసాంఘిక శక్తులను రెచ్చగొట్టాలని చూస్తున్నాడని ఆరోపించారు. యువత అప్రమత్తంగా ఉండండి.. పవన్ సిద్ధాంతాలు తెలియని వ్యక్తి.. తప్పులన్నీ ఆయన దగ్గర పెట్టుకుని ఎదుటి వారిని దూషించే మనస్తత్వం పవన్ ది అని ఫైర్ అయ్యారు.చిత్తశుద్ధిగా పరిపాలిస్తున్న జగన్ పై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నాడు అని పవన్‌పై మండిపడ్డ అంబటి రాంబాబు.. సీఎం జగన్ గురించి నాకు అంతా తెలుసు అని బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నాడు.. ఇక, హైదరాబాద్ నుండి వచ్చి మమ్మల్ని గెలకక పోతే పవన్ కు తోచదన్న ఆయన.. వారాహి పైకి ఎక్కి చిందులు వేస్తున్న ప్రాణాలు కు తెగించానని చెప్తున్నాడు.. చంద్రబాబు ,లోకేష్ ల పల్లకిలు మోస్తున్న పవన్ కు విప్లవం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. మరోవైపు.. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ను చంద్రబాబుకు అమ్మేశాడన్న అనుమానం ఉంది.. వారాహి పేరు పెట్టుకుని ఆ వాహనం పై నుండి అసత్య ప్రచారాలు, అసభ్య పదజాలం వాడుతున్నాడు.. అందుకే పవన్ పంది విూద ఊరేగుతున్న పిచ్చికుక్క అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు.
ప్యాకేజీ స్టార్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి హాట్ కామెంట్లు చేశారు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.. ఈ రోజు విూడియాతో మాట్లాడిన ఆయన.. భీమవరం సభపై సస్పెన్స్ క్రియేట్ చేసిన పవన్ కల్యాణ్.. తన ప్రసంగాన్ని తుస్సుమనిపించారు అంటూ సెటైర్లు వేశారు.. యువకులు, రైతులు, శ్రామికులు మోసపోతున్నారు అంటూ అబద్దాలు ఆడారు.. జనసేన అంటే ప్యాకేజీ పార్టీ.. అబద్దాల పార్టీ.. కానీ, సీఎం జగన్ మేనిఫెస్టోను భగవద్గీతా, బైబిల్, ఖురాన్ గా భావిస్తారని తెలిపారు. ప్రభుత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా భావించే వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడిన ఆయన.. పవన్ తనని తాను ఎందుకు మోసం చేసుకుంటారు..? మహనీయుల పేర్లు చెబుతూ నీచమైన రాజకీయాలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి.. చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నారని విమర్శించారు గ్రంధి.. ముద్రగడ కుటుంబాన్ని చంద్రబాబు హింసిస్తే అన్ని వర్గాలు బాధ పడ్డాయి.. విూరు చేసిన దాష్టికాలు భరించలేకే ప్రజలు మిమ్మల్ని ఓడిరచారన్న ఆయన.. 2019లో విడివిడిగా పోటీ చేస్తున్నాం అంటూ ప్రజలకు చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేశారు.. పవన్ ఉసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మార్చుకున్నారని మండిపడ్డారు. నాకు సీఎం పదవి ఎవరు ఇస్తారని పవన్ మాట్లాడారు.. నాకు విూరంతా ఓట్లు వేయలేదంటూ సొంత పార్టీ వాళ్లను అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు. మహనీయుల పేర్లు పలుకుతూ వారికి అపవిత్రత ఆపాదిస్తున్నారు. పోరాటంలో ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ పేరు చెబుతూ ఒంటరిగా వెళ్లి ఆత్మార్పణ చేయాల్సిన పని లేదంటారు.చంద్రబాబు మద్యపాన నిషేదం ఎత్తేశారు కాబట్టి ఇప్పుడు ఆయన్ని సపోర్ట్ చేస్తూ మద్యపాన నిషేదం సాధ్యం కాదంటున్నారని విమర్శించారు. చంద్రబాబులో భగత్ సింగ్, పొట్టి శ్రీరాములు, చేగువేరా కనిపిస్తున్నారెమో పవన్ కల్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. భీమవరం వచ్చి డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడిన పవన్.. అంతకు ముందు పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వారిని ప్రశ్నించలేదని మండిపడ్డారు. ఇక, డంపింగ్ యార్డ్ కోసం రహస్యంగా కార్యాచరణ చేస్తున్నాం.. లేదంటే కోర్టులో అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.