హైదరాబాద్ ఏప్రిల్ 29 (ఇయ్యాల తెలంగాణ) ; తెలంగాణ 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఈ రోజు విడుదల కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలు ఆన్ లైన్ లో విడుదల కాబోతున్నాయి. 10వ తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పదో తరగతి పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్ సైట్https://bse.telangana.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు.

