కాకినాడ, జులై 14,(ఇయ్యాల తెలంగాణ ): కాకినాడలోని పిఆర్ ప్రభుత్వ కళాశాలలో నానో టెక్నాలజీ, బయో మెడికల్ అప్లికేషన్స్పై శనివారం జాతీయ స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బివి తిరుపణ్యం తెలిపారు. ఈ సందర్భంగా తిరుపణ్యం కళాశాలలోని ఆయన చాంబర్లో ఈ సెమినార్కు సంబంధించి వివరాలను వెల్లడిరచారు. శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నోవెల్ మెటీరియల్స్, నానో టెక్నాలజీ, బయో మెడికల్ అప్లికేషన్స్పై ఈ సెమినార్ నిర్వహిస్తామని ఈ సెమినార్కు సుమారు 500 మంది వరకు హాజరవుతారని ఈ సెమినార్లో రీసెర్స్ స్కాలర్స్ , పీజీలకు ట్రిపుల్ ఐటీ పూర్వ డైరెక్టర్ ప్రొఫెసర్ జి భగవన్నారాయణ వివరిస్తారన్నారు. ఈ సెమినార్లో ఆయన ప్రసంగం వారిని పరిశోధన వైపు మళ్ళించేలా మూడు విభాలుగా బోధిస్తారని చెప్పారు. ఈ సెమినార్కు ఆదికవి నన్నయ యూనివర్సిటీ తాడేపల్లిగూడెం క్యాంపస్ సహకారం నిర్వహిస్తున్నామని, స్థానికంగా అలుమ్ని, వాకర్స్ అసోసియేషన్లు సహకరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి అక్ను విసి, రిజిస్టర్లను కూడా ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తిరుపణ్యం వెల్లడిరచారు. ఈ సమావేశంలో కెమిస్ట్రీ హెచ్ఓడి డాక్టర్ డి చెన్నారావు, ఫిజిక్స్ హెచ్ఓడి యు కృష్ణ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం కరపత్రాన్ని ఆవిష్కరించారు.