నిత్యావసర కిట్లుపంపిణి |
నిత్యావసరాల సరుకుల కిట్లను పేద ప్రజలకు అందజేస్తున్న ఎమ్మెల్యే మోజం ఖాన్ |
హైదరాబాద్ మే 17 ఇయ్యాల తెలంగాణ
బహదూర్ పుర నియోజక వర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు శాసన సభ్యులు మొహమ్మెద్ మోజం ఖాన్ స్థానిక కార్పొరేటర్లతో కలసి నిత్యావసరాల సరుకులు పంపిణి చేయడం జరిగింది. హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు, ఎం ఐ ఎం పార్టీ అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఆదేశాల మేరకు ఈ రోజు నియోజక వర్గం పరిధిలోని రామ్నాస్ పుర డివిజన్ జహ్నుమ డివిజన్ పరిధి లోని గుల్షన్ నగర్, మొయిన్ పుర తదితర ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల కిట్లను పంపిణి చెయడం జరిగింది.
ఎమ్మెల్యే మోజం ఖాన్ వెంట కార్పొరేటర్లు మహమ్మద్ మునీర్, హుస్సేనీ పాషా పాల్గొన్నారు. సుమారుగా 800 కిట్లను ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది. లాక్ డౌన్ సమయంలో ఎవరు పస్తులు ఉండరాదనేదే తమ ఆకాంక్ష అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎం ఐ ఎం నాయకులు పాల్గొని నిరుపేద కుటుంబాలందరికి ఆహార కిట్లు అందేలా చూశారు.