హైదరాబాద్, జూన్ 21 (ఇయ్యాల తెలంగాణ) : టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిర్మల్, కొడంగల్, గజ్వేల్, మానకొండూరు నియోజకవర్గాల నుంచి వచ్చినవారు కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన వారిలో కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండల బీఆరెస్ కార్యకర్తలు వున్నారు. బీజేపీ నుంచి తిరిగి నిర్మల్ పట్టణానికి చెందిన నేతలు కాంగ్రెస్ లో చేరారు. బీఆరెస్ నుంచి గజ్వేల్ నియోజవర్గానికి చెందిన పలువురు బీఆరెస్ కార్యకర్తలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్ఆరు. మానకొండూరు నియోజకవర్గానికి చెందిన గన్నేరువరం మండలం మైలారం, చొక్కారావుపల్లి, సాంబయ్యపల్లి సర్పంచులు, గన్నేరువరం ఎంపీటీసీ, ఖాసీంపేట ఉపసర్పంచ్, పలువురు కార్యకర్తలు బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు.