హైదరాబాద్, జులై 02 (ఇయ్యాల తెలంగాణ) : జాతీయ వైద్యుల దినోత్సవాని పురస్కరించుకొని అఖిలభారత ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పొట్లకాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్ డాక్టర్ ప్రతిభ లక్ష్మికి శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్లు సమాజానికి ఏంతో గొప్ప ఉన్నత స్థానం లో ఉంటారని కొనియాడారు. అందుకే వారిని భగవతునిగా అభివర్ణిస్తారని తెలిపారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్బంగా దేశవ్యాప్తంగా ఉన్న డాక్టరులందరికి అఖిలభారత ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పొట్లకాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.