చార్మినార్, సెప్టెంబర్ 27 (ఇయ్యాల తెలంగాణ) : చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి మొదటి రోజు నుంచే భక్తులు క్యూ కట్టారు. ఆలయ కమిటి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగిస్తున్నారు. నిత్యం వివిధ ఆకృతుల్లో అమ్మవారు కొలువు దీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. మామూలు రోజుల్లోనే చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని నిత్యం వేలాదిగా భక్తులు సందర్శిస్తూ ఉంటారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా దేవాలయ కమీటీ ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెండవ రోజు అలంకరణతో అమ్మవారు భక్తులకు అభయమిస్తున్నారు. దసరా వేడుకల వరకు ప్రత్యేక అలంకరణ నిత్య విశేష పూజ కార్యక్రమాలతో పాటు ప్రత్యేక పూజ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ ట్రస్టీ శశికళ పేర్కొన్నారు. దేవి శరన్నవరాత్రి వేడుకల సందర్బంగా ఆలయానికి విచ్చేసే భక్తుల సంఖ్య పెరిగిందని ఈ రోజు మంగళవారం కావడంతో అధిక సంఖ్యలో భాగ్యలక్ష్మీ అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారని శశికళ పేర్కొన్నారు.