కోవిడ్ రూపం మార్చుకుంటుందా అని పరిశోధనలు
న్యూఢల్లీ,మే5(ఇయ్యాల తెలంగాణ): దేశంలో గత రెండు నెలలుగా వ్యాప్తి చెందుతోన్న కరోనా వైరస్‌లో ఏదైనా మార్పు అంటే మ్యుటేషన్ జరిగిందా అనే విషయాన్ని అధ్యయనం చేయడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ యోచిస్తోంది. కోవిడ్2 తన రూపం మార్చుకుందా అనే విషయాన్ని తెలుసుకోవడం వల్ల దానికి విరుగుడుగా కనుగొనే వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తోందా లేదా అనే విషయాన్ని నిర్దారించు కోవడానికి ఉపయోగపడు తుందని దేశంలోనే అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థ సీనియర్ శాస్త్రవేత్త వెల్లడించారు. ఈ అధ్యయనం ద్వారా వైరస్ మరింత బలంగా వృద్ధిచెందుతోందా? మరింత త్వరగా వ్యాప్తిచెందుతోందా అనే విషయం తెలుస్తుంది. కరోనా వైరస్ మార్పుచెందిందా? లేదా అనే విషయాన్ని అంచనా వేయడానికి కోవిడ్19 రోగుల నుంచి నమూనాలు సేకరించి పరీక్ష చేస్తారు. ఇతర దేశాలతో పోల్చినప్పుడు భారత దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో గరిష్ట వ్యత్యాసం 0.2 నుంచి 0.9 మధ్యలో ఉన్నట్టు గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్‌ఫ్లూయెంజా డేటాని బట్టి తెలుస్తోందని మరో శాస్త్రవేత్త వెల్లడించారు. . ఇతర దేశాల నుంచి వచ్చేవారి ద్వారా భారత్‌లోకి వివిధ రకాల కరోనా వైరస్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మూడు రకాలైన వైరస్ లు దేశంలో ఉన్నట్టు గుర్తించారు. ఒకటి వూహాన్ నుంచి వచ్చిందీ, మరొకటి ఇటలీ నుంచి, మరో వైరస్ ఇరాన్ నుంచి వచ్చిన రకం. అయితే ఇరాన్ నుంచి వచ్చిన వైరస్ మాత్రం చైనా వైరస్‌ని పోలి ఉంది. అయితే మనదేశంలోకి ప్రవేశించిన వైరస్ ప్రధాన లక్షణాలను కనుక్కోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందనీ, అయితే అన్నిరకాల వైరస్‌లో ఒకేరకం ఎంజైము ఉండడం వల్ల టీకాలు సమర్థవంతంగానే పనిచేస్తాయని భావిస్తున్నారు. భారత్‌లో ఈ వైరస్ మూడు నెలలుగా ఉన్నప్పటికీ త్వరగా మార్పుకు గురికాలేదనీ ఐసీఎంఆర్‌లోని ఎపిడెమాజీ అండ్ కమ్యూని కబుల్ డిసీజెస్ హెడ్ డాక్టర్ రమణ ఆర్.గంగాఖేద్కర్ గతంలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న ప్రాణాంతక వైరస్ నివారణకు వ్యాక్సిన్ కనుగొనేందుకు ఆరు భారతీయ కంపెనీలు పనిచేస్తున్నాయి. దాదాపు 70 వాక్సిన్లు పరీక్షించగా మూడు మాత్రం క్లినికల్ ట్రయల్స్ దశకు చేరాయి. అయితే 2021 కన్నా ముందు వ్యాక్సిన్ ప్రజల వినియోగానికి రాకపోవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
—————————–
Investigations on whether the covid form
New Delhi, May 5 (Iyyala Telangana) The Indian Council of Medical Research is looking to study whether any mutation in the corona virus that has been spreading in the country for the past two months has taken place. A senior scientist at the country’s top medical research institute said that knowing whether Kovid2 could change its form would be useful in determining whether the vaccine was effective. Will the virus grow stronger with this study? Whether it will spread more quickly will be known. Has the Corona Virus Changed? Samples are collected and tested from Covid19 patients to assess whether or not. According to the Global Initiative on Sharing All Influenza Data, the maximum difference in the prevalence of coronavirus in India is between 0.2 and 0.9 in comparison to other countries. . Various coronaviruses are likely to enter India through people from other countries. All three types of viruses are found in the country. One is from Wuhan, the other is from Italy, and the virus is from Iran. The virus from Iran, however, is similar to the Chinese virus. However, it will take some time for the virus to enter the country to find its main features, but the vaccine is expected to be effective because of the presence of a single enzyme in the virus. Dr Ramana R. Gangakhedkar, Head of Epidemiology and Communicable Diseases at ICMR, said earlier that the virus had not changed in India for three months. Six Indian companies are working to find a vaccine for the worldwide deadly virus. Approximately 70 vaccines were tested and only three had reached clinical trials. Experts say the vaccine may not be available for public use before 2021.