రంగారెడ్డి జులై 12, (ఇయ్యాల తెలంగాణ ): రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుండగులు కత్తులతో బెదిరించి దోచుకున్న ఘటన జరిగింది. స్థానిక శివాలయం గుడి సవిూపంలోని వెంకటయ్య సిద్దయ్య ఇద్దరు లేబర్ పని చేసుకుని తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఇద్దరు దుండగులు వచ్చి ఒక్కసారిగా కత్తులతో బెదిరింపులకు పాల్పడ్డారు. పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి ఇద్దరిని తీసుకువెళ్లి కత్తులు చూపించి వారి వద్ద నుండి 12 వేల రూపాయలు రెండు సెల్ ఫోన్లు తీసుకుని వెళ్ళిపోయారు.భయాందోళనకు గురైన ఇద్దరు బాధతులు అక్కడే ప్రయాణిస్తున్న వ్యక్తులకు విషయం చెప్పారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులకు బాధితులు వివరాలు చెప్పారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.