హైదరాబాద్, మార్చి 5 (ఇయ్యాల తెలంగాణ) : అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ పేరును లక్ష్మీనారాయణ ముదిరాజ్ పేరుగా మార్చాలని ముదిరాజ్ సంక్షేమ సమితి నాయకులు సురేష్ ముదిరాజ్ పొట్లకాయ వెంకటేశ్వర ముదిరాజ్ లు కోరారు. ఈ మేరకు వారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంక్షేమ సమితి నాయకులు సురేష్ ముదిరాజ్ పొట్లకాయ వెంకటేశ్వర ముదిరాజ్ సైదుల్ ముదిరాజ్ శ్రీహరి ముదిరాజ్ రమాదేవి ముదిరాజ్ విజయలక్ష్మి ముదిరాజ్ రామ్మూర్తి ముదిరాజ్ లక్ష్మణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
