తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి అప్పుడే మొదలైనట్లు అనిపిస్తోంది దీంతో తమ ఓటు ఓటరు జాబితాలో ఉందా ? లేదా ? అనేక మంది ఓటర్లు సామవుతూ ఉంటారు. ఇక కొత్తగా 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు కూడా ఓటరు కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలో అంటూ సతమవుతూ ఉంటారు. అసలు ఓటరు కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి. ఎలాంటి అభ్యంతరాలున్నా ఏ ఫారం నింపాలి. ఏ Website కు వెళ్ళాలి. అనే విషయాలను తెలుసుకుందాం..
ముందుగా కొత్తగా ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఫారం నెం -6 (Form – No: 6) ను నింపి ఎన్నికల అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. మీరు చేసుకునే ధరఖాస్తు ఆన్లైన్ (Online) లేదా ఆఫ్ లైన్ (Offline) ద్వారా ధరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది. ఇందులో భాగంగా ఈ కింది నమూనా ఫారం -6 ను మీకు ఉదాహరణకు ఉంచడం జరిగింది.
ఆన్లైన్ (Online) ద్వారా కొత్తగా ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు ఈ కింద సూచించిన Website Address ద్వారా ఫారం – 6 నింపగలరు.
https://ceotelangana.nic.in/# లేదాhttps://www.nvsp.in/లలో దరఖాస్తును పూరించాల్సి ఉంటుంది.
మీరు మీ దరఖాస్తును ఆన్ లైన్ ద్వారా అందజేయడానికి ముందుగా మీ యొక్క రిజిస్టర్ ఫోన్ నుంచి లాగిన్ చేసుకొని User ID మరియు Pass Word ను Create చేసి ఆన్లైన్ (Online) దరఖాస్తు నింపి మీ పూర్తి వివరాలను నమోదు చేసిన అనంతరం Submit Button నొక్కిన తరువాత మీ దరఖాస్తు అధికారులకు చేరుతుంది. అప్పుడు సంబంధిత BLO బూత్ లెవల్ అధికారికి మీ ఫారం చేరుతుంది. అనంతరం 7 రోజులలో మీ దరఖాస్తును పరిశీలించి Verify చేసిన అనంతరం BLS బూత్ లెవెల్ సూపర్ వైజర్ కు మీ దరఖాస్తు అందుతుంది. అతను వెరిఫికేషన్ చేసిన తరువాత 7 రోజుల్లో AERO కు మీ దరఖాస్తును పంపించడం జరుగుతుంది. మీ దరఖాస్తు సరైనదైతే ACCEPT అవుతుంది. లేదా తప్పుడు వివరాలతో ఉంటే Reject చేయడం జరుగుతుంది. సంబంధిత ERO ఫైనల్ గా మీకు ఓటరు కార్డు నెంబర్ ను సూచిస్తూ ఓటరు జాబితాలో మీ పేరు నమోదవుతుంది.
ఇదే తరహాలో అభ్యంతరాలు, చిరునామా మార్పు కోసం ఫారం – 8, deletion కోసం ఫారం – 7 నింపాల్సి ఉంటుంది.
దీంతో పాటు మొబైల్ యాప్ (Mobile APP) ద్వారా కూడా మీరు ఓటరు నమోదు కోసం ధరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది భారత ఎన్నికల సంఘం (ECI) Election Commission Of Indiahttps://eci.gov.in/